Begin typing your search above and press return to search.
గంటా మార్క్ పాలిటిక్స్ : వస్తానంటే వద్దంటారా...?
By: Tupaki Desk | 9 Jun 2022 11:30 PM GMTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నారా. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు, ఆయన తెలియనివ్వరు కూడా. మూడేళ్ళుగా సైలెంట్ గా ఉన్న గంటా ఇపుడిపుడే టీడీపీలో హడావుడి చేస్తున్నారు. మరో వైపు చూస్తే ఆయన వైఖరి కూడా విచిత్రంగా ఉంటోంది.
పార్టీ కీలక సమావేశాలకు డుమ్మా కొడతారని ప్రచారంలో ఉంది. అయినా సరే చంద్రబాబే సీఎం కావాలని గట్టిగా నినదిస్తారు. కానీ మహానాడు లాంటి చోట్ల అయితే నో వాయిస్ అన్నట్లుగా ఉంటారు. ఇవన్నీ చూస్తూంటేనే గంటా ఏ వైపు ఉంటారు అన్న టెన్షన్ ఆయన తో పాటు రాజకీయ వర్గాలలో పెరిగిపోతోంది.
అయితే గంటా మీద లేటెస్ట్ గా వస్తున్న ప్రచారం ఏంటి అంటే ఆయన జనసేనలో చేరుతారు అని. నిజానికి ఈ ప్రచారం చాలా కాలంగా ఉన్నా ఇపుడిపుడే ఊపందుకుంది. గంటా చేరిక మీద జనసేనలో కూడా చర్చ సాగుతోంది అంటున్నారు.
మరో వైపు చూస్తే సేఫ్ ఉత్తరాంధ్రా ఫోరం పేరిట కొంతమంది సోషల్ మీడియా వేదిక ద్వారా గంటాను జనసేనలో చేర్చుకోవద్దు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఆయన కనుక జనసేనలో చేరితే ప్రజారాజ్యం మాదిరిగానే అది కూడా మునిగిపోవడం ఖాయమని ఈ ఫోరం ప్రతినిధులు పోస్టింగ్స్ పెడుతున్నారు.
మరి గంటా మనసులో ఏముంది, ఆయన నిజంగా జనసేనలో చేరుతారా. దానికి అధినాయకుడు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఇవన్నీ ప్రశ్నలే. అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన గంటా జనసేనలో చేరాలనుకుంటే ఆపేవారు ఎవరూ ఉండరని కూడా అంటున్నారు.
అన్నీ ఆప్షన్లు తన దగ్గర పెట్టుకున్న గంటా సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా గంటా పాలిటిక్స్ కోసం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.