Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వల్ల జరిగిన మంచి ఏంటంటే ..?

By:  Tupaki Desk   |   13 May 2020 10:50 AM GMT
లాక్ డౌన్ వల్ల జరిగిన మంచి ఏంటంటే ..?
X
చెడు వెనుక మంచి .. కష్టం వెనుక సుఖం వస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ వైరస్‌ తో ప్రపంచ దేశాలన్ని విలవిల్లాడుతున్నాయి. ఈ వైరస్ రాకముందు కాలుష్యంతో పర్యావరణం కూడా విలవిల్లాడిపోయింది. కాలుష్యపు మరకలు కాదు..కాదు కాలుష్య భూతం ఆవహించిన ప్రకృతి మాత పరిస్థితి వర్ణనాతీతం. కానీ , ఈ మహమ్మారి ప్రాణంతకరమైనదే అయినప్పటికీ ... పర్యారణానికి మంచే చేసింది. అదే లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోవటంతో ప్రకృతి మాత ఊపిరి పీల్చుకుంది.

హాయిగా ఒళ్లువిరుచుకుని స్వేచ్ఛగా స్వచ్చమైన గాలిని ప్రసరింపజేసింది. ఇదంతా కరోనా కట్టడికి ప్రకటించిన లాక్ డౌన్ వల్లనే. ఈ విషయాన్ని పర్యావరణవేత్తలు ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావటంతో చెత్త తగ్గిపోయింది. ఈ విషయాన్ని ప్రకృతికి నెలవైన కేరళ రాష్ట్రం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చేసిన పరిశీలనలో వెల్లడైంది. కేరళ రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో చెత్త ఉత్పత్తి 40 శాతం తగ్గిపోయిందని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పరిశీలనలో వెల్లడైంది. తిరుచిరాపల్లి నగరంలో రోజుకు 460 టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది.

చెత్త పేపర్లు, ఆహారవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు..ఇలా అన్నీ కలిపి 51 శాతం ఉత్పత్తి అవుతోంది.పాత టైర్లు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తుంటారు. తిరుచ్చి నగరంలోని శ్రీరంగం, గాంధీ మార్కెట్ తదితర ప్రాంతాలన్నీ కలిపి మార్చి 25,2020 460 టన్నుల చెత్త వచ్చేది. కానీ లాక్ డౌన్ వల్ల ప్రజలు బైటకు రాకపోవటంతో వ్యర్ధాలు తగ్గాయి. మార్కెట్లతోపాటు ఇళ్లలోని చెత్త తగ్గింది. గతంతో 460 టన్నుల చెత్త లభ్యమైతే లాక్ డౌన్ సమయంలో రోజుకు 270 టన్నుల చెత్త మాత్రమే వస్తోంది. అంటే చెత్త సగానికి సగం తగ్గిపోయింది. ఒక్క తిరుచిరాపల్లిలోనే ఇంతభారీ స్థాయిలో చెత్త తగ్గిపోతే..దేశ వ్యాప్తంగా లెక్క వేసుకుంటూ చెత్త..ప్లాస్టిక్ వ్యర్ధాల వినియోగం ఎంత భారీ నుంచి అతి భారీ స్థాయిలో తగ్గిపోయిందో లెక్కలు వేసుకుంటే కరోనా మంచే చేసింది..లాక్ డౌన్ వల్ల మనం ఇబ్బంది పడ్డా పర్యావరణానికి మంచే చేశాం అనుకోక తప్పదు. అలాగే పలు ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం కూడా భారీగా తగ్గిపోయింది.