Begin typing your search above and press return to search.
ఏపీలో జులై 15 నుండి చెత్త పన్ను షురూ .. తొలిదశలో ఆ 45 నగరాలు, పట్టణాల్లో ... !
By: Tupaki Desk | 13 July 2021 1:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో వ్యర్థాల సేకరించేందుకు గాను ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో ఈ నెల 15 నుంచి 16 నగరపాలక సంస్థలు, 29 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్ గ్రేడ్ పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఆ తర్వాత క్రమంగా దీనిని విస్తరిస్తారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల సేకరణకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ (క్లాప్) అమలు కోసం ఇప్పటి వరకు పాలకవర్గం అనుమతి తీసుకోని చోట వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందాలని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది.
నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కోచోట, ఒక్కో విధంగా వినియోగ రుసుములు వసూలు చేయనున్నారు. గృహాలకైతే నెలకు రూ. 120, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే రూ.1,500, బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ. 3 వేలు, ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటళ్ల నుంచి రూ. 15 వేలు, పండ్ల దుకాణాల నుంచి రూ. 200, ఫంక్షన్ హాళ్ల నుంచి రూ. 4-15 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రూ. 750-10 వేలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రూ. 500-3 వేలు, చికెన్, మటన్ దుకాణాల నుంచి రూ. 300 వసూలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
భారీ సంఖ్యలో ఉన్న స్ధానిక సంస్ధలకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వ ఖజానా సహకరించపోవడంతో ఇప్పుడు ఎక్కడికక్కడ చెత్తపన్ను వసూలు ద్వారా రాబడి పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఎల్లుండి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది. క్లాప్ పథకంలో భాగంగా తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 45 కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఘనవ్యర్ధాల సేకరణ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 16 కార్పోరేషన్లతో పాటు 29 మున్సిపాలిటీలు ఉన్నాయి. తొలి దశలో ఒక్కో కార్పోరేషన్, మున్సిపాలిటీలో రెండేసి డివిజన్లు, వార్డుల చొప్పున ఈ పన్ను ప్రయోగాత్మకంగా వసూలు చేస్తారు.
ఇలా 90 డివిజన్లు, వార్డుల్లో ఈ చెత్త పన్ను వసూళ్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో ఎల్లుండి నుంచి స్ధానిక సంస్ధలు నిర్ణయించిన విధంగా ఘన వ్యర్ధాల సేకరణ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ మేరకు స్ధానిక సంస్ధల్లో తీర్మానాలు చేయాలని ఇప్పటికే పురపాలకశాఖ నుంచి కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. పలు చోట్ల తీర్మానాలు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండో దశలో మిగతా 68 మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో చెత్త పన్ను వసూలు చేస్తారు. స్ధానిక సంస్ధల పరిధిలో ఘన వ్యర్ధాల సేకరణ ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ దాన్ని విస్మరించి ఛార్జీల వసూలుకు సిద్దం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కోసం స్ధానిక సంస్ధల్లో తీర్మానాలు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే దీన్ని విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.