Begin typing your search above and press return to search.
చెత్త నిరసనతో కాంగ్రెస్ కు షాక్
By: Tupaki Desk | 5 Sep 2017 5:32 AM GMTఆందోళనలు, నిరసనల రూపం మారిపోతోంది. గతంలో నినాదాలకే పరిమితమయిన నిరసన రూపాలు ఇటీవలి కాలంలో విభిన్నతను చాటుకుంటున్నాయి. అలా వినూత్నంగా జరిగిందే ఈ `చెత్త నిరసన`. ఉద్యోగాల క్రమబద్దీకరణపై కామెంట్ చేసినందుకు ఇంటి ముందు చెత్తవేసి నిరసన తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు. ఎంతోకాలంగా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మంది పారిశుద్ధ్య సిబ్బంది సర్వీసులను ఎమ్మెల్యే పుట్ట మధు సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అనేక పోరాటాల ఫలితంగా తమ కల ఫలించిందని సదరు ఎనిమిది మంది కార్మికులు ఆనందంలో ఉండగా, ``ఎన్ని డబ్బులు తీసుకొని పర్మినెంట్ చేశారు? ఎవరు ఎంతెంత తీసుకున్నారు?`` అని ప్రశ్నిస్తూ మంథని మాజీ ఉపసర్పంచ్ - కాంగ్రెస్ నాయకుడు సతీశ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. మాజీ ఉప సర్పంచ్ ఆరోపణల నేపథ్యంలో వీరికి క్రమబద్దీకరణ ఆదేశాలు ఇవ్వకుండా డీపీవో నిలిపివేశారు. దీంతో సతీశ్ తీరుపై మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు భగ్గుమన్నారు. సతీశ్ తీరు కారణంగానే తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆగ్రహిస్తూ సోమవారం పట్టణ చెత్తనంతా సతీశ్ ఇంటి ఎదుట పోసి కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాము ఎవరికీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కోర్టు ఆర్డరు - ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. సతీశ్ కారణంగానే తాము ఆర్డర్ అందుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సతీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రోజూ చెత్తను సేకరించి ఆయన ఇంటి ఎదుట పోస్తామని హెచ్చరించారు. ఆయన ఇంటికి కరెంటు - నీళ్లు కూడా బంద్ పెడతామన్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత నెలనెలా జీతాలు వస్తున్నాయని పారిశుధ్య కార్మికులు పేర్కొంటూ ఇంతకు ముందున్నదానికంటే జీతం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు గతంలో తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని...ఇప్పుడు సర్కారు చేస్తుంటే మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు.