Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పార్టీ నేత‌లు సొంత‌గూటికి వ‌చ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   13 May 2017 5:23 AM GMT
జ‌గ‌న్ పార్టీ నేత‌లు సొంత‌గూటికి వ‌చ్చేస్తున్నారు
X
ఎలాంటి ప్ర‌లోభాలు లేవు. లోగుట్టు ఒప్పందాలు అస‌లే లేవు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిరిగి వ‌చ్చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తెలంగాణ అధికార‌ప‌క్షం నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో పాటు.. మ‌రికొన్ని డ్రైవ్ ల‌తో జ‌గ‌న్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు టీఆర్ ఎస్‌ లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఇలా పార్టీ మారిన వారికి ఇప్పుడిప్పుడే త‌త్త్వం బోధ ప‌డుతోంది. దీంతో.. గులాబీ జెండా నీడ‌కు వెళ్లిన వారంతా.. ఎవ‌రూ అడ‌గ‌కుండానే త‌మ‌కు తామే స్వచ్ఛందంగా పార్టీలోకి తిరిగి వ‌చ్చేస్తున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌లే అజెండాగా చేసుకొని పొరాడుతున్నపార్టీగా గుర్తించిన నేత‌లు సొంత‌గూటికి వ‌చ్చేస్తున్నారు.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు భీష్వ ర‌వీంద‌ర్‌.. క‌రీంన‌గ‌ర్ జిల్లా మాజీ అధ్య‌క్షుడు సింగిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి లు పార్టీలోకి తిరిగి వ‌చ్చేశారు.

తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి వీరిని పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానిస్తూ స్వాగ‌తం ప‌లికారు. పార్టీ కండువాతో వారిని పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ ఆశ‌ల‌కు.. ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప‌ని చేస్తుంద‌ని.. 2019 ఎన్నిక‌ల నాటికి రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ గ‌ట్టి పోటీని ఇస్తుంద‌ని చెప్పారు. రానున్న రోజుల్లో మ‌రింత‌మంది జ‌గ‌న్ పార్టీ నేత‌లు పార్టీలోకి తిరిగి వ‌చ్చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పారు. హైద‌రాబాద్ శివారుకు ధ‌ర్నా చౌక్‌ ను త‌ర‌లించాల‌ని భావిస్తున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తునట్లు చెప్పిన గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి.. ధ‌ర్నాచౌక్ కోసం పోరాడుతున్న వారితో క‌లిసి న‌డుస్తామ‌ని.. వారితో క‌లిసి ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/