Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ ను వెనక్కి నెట్టి ముందుకు గౌతం అదానీ
By: Tupaki Desk | 21 Dec 2022 2:30 AM GMTదేశంలో మోడీ రాజ్యం వచ్చాక గుజరాతీలు దూసుకుపోతున్నారు. మోడీకి సన్నిహితుడైన దేశంలోనే అపరకుబేరు గౌతం అదానీ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ఇప్పటిదాకా 3వ అపరకుబేరుడిగా ఉన్న గౌతం అదానీ ఇప్పుడు ఏకంగా టాప్ 2లో ఉన్న ఎలన్ మస్క్ ను దాటేసి రెండో స్తానానికి చేరుకున్నట్టు సమాచారం.
గత ఏడాది కాలంగా ట్విటర్ ను కొన్నాక ఎలన్ మస్క్ సంపద కరిగిపోతోంది. ఇప్పటిదాకా ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్న ఎలన్ మస్క్ 2వ ర్యాంకుకు దిగజారాడు. ఇటీవలే కోల్పోయాడు. ఇప్పుడు మరింతగా దిగజారి 3వ స్తానానికి దిగజారాడు. 2022లో ఎలన్ మస్క్ సంపద భారీగా క్షీణించడమే కారణం. కేవలం ఒక్క ఏడాదిలోనే ఎలన్ మస్క్ ఏకంగా 114 బిలియన్ డాలర్ల సంపాదన కోల్పోయాడు.
ఇదే సమయంలో భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీ సంపద విపరీతంగా పెరిగిపోయింది. అనేక కంపెనీలు కొనుగోలు చేసిన అదానీ తన సంపదను 49 బిలియన్ డాలర్లకు పైగా పెంచుకున్నాడు. 2022లో అత్యధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో నంబర్ 1గా నిలిచారు. ఇదే సమయంలో ఎలన్ మాస్క్ ను తాజాగా దాటేశాడు.
40 బిలియన్ డాలర్లు విలువైన టెస్లా షేర్లను ఈ ఏడాది ఎలన్ మస్క్ విక్రయించారు. సంపద క్షీణత తర్వాత ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం 156 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. 2022లో మస్క్ సంపాదన అత్యల్పంగా నమోదైంది.
బెర్నార్డ్ అర్నల్ట్ $172.9 బిలియన్ల నికర విలువతో ఇప్పటివరకూ ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడిగా ఉన్న వ్యాపారవేత్త టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ను అధిగమించాడు. అర్నల్డ్ ఫ్రెంచ్ వ్యాపారవేత్త. లూయిస్ విట్టన్, హెన్నెస్సీ, మార్క్ జాకబ్స్ , సెఫోరా వంటి ఎల్.వీఎంహెచ్ బ్రాండ్‌లకు సీఈవోగా ఉన్నారు. ఆయన తన సంపదతో నంబర్ 1 ర్యాంకులోకి చేరుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.