Begin typing your search above and press return to search.

ర‌చ్చ చేసే సీఎం దృష్టి బుద్ధుడిపై ప‌డింది

By:  Tupaki Desk   |   3 May 2018 6:32 AM GMT
ర‌చ్చ చేసే సీఎం దృష్టి బుద్ధుడిపై ప‌డింది
X
గత కొద్దిరోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్.. తాజాగా మ‌రోవివాదంలో చిక్కుకున్నారు. ప్రతిరోజు ఏదో విధంగా నోరు జారుతుండటం.. పార్టీపై విమర్శలు వస్తుండటంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.స్వయంగా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ రంగంలోకి దిగి బిప్లవ్‌ను తన ఎదుట హాజరవ్వాల్సిందిగా సమన్లు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మ‌రుస‌టి రోజే హాట్ కామెంట్లు చేశారు. `నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని.. నా ప్రభుత్వాన్ని హేళన చేసిన వారి గోళ్లను నేను కత్తిరిస్తాను.. కాబట్టి నా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం చేయకండి` అంటూ హెచ్చరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ర‌చ్చ కొన‌సాగుతుండ‌గానే... బుద్ధుడి గురించి మాట్లాడారు.

బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ బుద్ధుడు భారతదేశంతో పాటుగా జపాన్, మయాన్మార్, టిబెట్ దేశాల్లో నడిచి శాంతి, సామరస్యాలను ప్రభోదించాడని.. ఆయన అడుగుజాడల్లో అశోకుడు భౌద్దాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా శాంతి - సామరస్యాలను పెంపొందించేందుకు కృషి చేశాడని.. ఒక చక్రవర్తి సన్యాసిగా మారిన ఏకైక నేల భారతభూమి ఒక్కటేనని కొనియాడారు. ప్రతి ఒక్కరు భారతదేశ సాంప్రదాయం.. సంస్కృతిని గౌరవించి.. శాంతి, సామరస్యాలతో జీవించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అధిష్టానం హెచ్చ‌రిస్తున్నా..సీఎం కామెంట్లు ఆగ‌డం లేద‌ని బీజేపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.