Begin typing your search above and press return to search.
మాజీ క్రికెటర్ కు ఎంపీ యోగం ఉందా!
By: Tupaki Desk | 10 May 2019 4:47 AM GMTఢిల్లీ సౌత్ నియోజకవర్గ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్న గౌతమ్ గంభీర్ కు కొంత వరకూ మెరుగైన అవకాశాలే ఉన్నాయని అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. అయితే గెలుపు గంభీర్ కు తేలిక కాదు అని, అయితే అతడు విజయం సాధించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే గంభీర్ కు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ - కాంగ్రెస్ ల నుంచి గట్టి పోటీనే ఉంది.
ప్రత్యేకించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గంభీర్ కు గట్టి పోటీ ఎదురవుతోందని.. అనూహ్యంగా ఆప్ అభ్యర్థి గంభీర్ మీద విజయం సాధించవచ్చు అనే మాట కూడా వినిపిస్తూఉంది. ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ - ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే అని విశ్లేషకులు అంటున్నారు.
గత లోక్ సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అప్పుడు బీజేపీ నలభై ఎనిమిది శాతం ఓట్లను పొందింది. ఆప్ ముప్పై రెండు శాతం - కాంగ్రెస్ పార్టీ పదిహేడు శాతం ఓట్లను పొందింది. ఒకవేళ ఈ సారి ఆప్ - కాంగ్రెస్ లు కలిసి పోటీ చేసి ఉన్నా.. బీజేపీ కన్నా వారి ఓటు భ్యాంకు కేవలం ఒక్క శాతం మాత్రమే ఎక్కువ అయ్యేది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి గంభీర్ కు అనుకూల పరిస్థితి ఉన్నట్టే అని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మరి కాస్త ఎక్కువ స్థాయిలో ఓట్లను సంపాదించుకోవచ్చు. ఆప్ కూడా మరింత పుంజుకోవచ్చు. అయితే బెస్ట్ ఆఫ్ త్రీలో మాత్రం గంభీర్ విజేతగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గంభీర్ కు ఎంపీ యోగం ఉన్నట్టే ఉందంటున్నారు!