Begin typing your search above and press return to search.
దేశభక్తే కాదు.. ఉతికేస్తున్న గంభీర్
By: Tupaki Desk | 24 Feb 2019 8:03 AM GMTదేశభక్తికి సంబంధించిన ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే గౌతం గంభీర్ కు ఆవేశంతోపాటు ఆలోచన పాళ్లు ఎక్కువే.. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో సైనికుల మరణాన్ని తట్టుకోలేని భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఏకంగా పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని పిలుపునివ్వడం సంచలనమైంది. ఏదైనా తప్పు జరిగితే దాన్ని నిలదీయడానికి గంభీర్ వెనుకాడరు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా అలాగే కడిగిపారేశాడు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ మధ్య తన వద్ద డబ్బు లేవని.. ఎన్నికల్లో పోటీచేయడానికి విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా కేజ్రీవాల్ వివిధ జాతీయ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. దీనిపై గౌతం గంభీర్ తీవ్రంగా స్పందించాడు. డబ్బులు లేవంటూ కేజ్రీవాల్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాడని మండిపడ్డారు. కేజ్రీవాల్ ప్రకటనలు చూస్తే కేజ్రీవాల్ మాల్ తరహాలో కనిపిస్తోందన్నారు. ప్రకటనల కోసం ఇంత సొమ్మును ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించాడు. ఈ సొమ్ము పన్ను చెల్లింపుదారులదేనన్నాడు.
కేజ్రీవాల్ తన వద్ద డబ్బులు లేవని అంటున్నారని.. కానీ ఈ ప్రకటనలు చూశాక అలా అనిపించడం లేదని గౌతం గంభీర్ ఎద్దేవా చేశారు. ప్రకటనల పేరుతో వృథా ఖర్చును తగ్గించుకోవాలని గంభీర్ సూచించారు. గంభీర్ ఇలా ధైర్యంగా ప్రశ్నించడం సంచలనమైంది. కోట్లు వృథా చేస్తున్న రాజకీయ నాయకులను సెలబ్రెటీలు ఎవ్వరూ ప్రశ్నించరు.. గంభీర్ మాత్రం ఇలా ధైర్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నే ఢీకొట్టడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.