Begin typing your search above and press return to search.

సూర్యకుమార్​ ను ఎందుకు తప్పించారు? గంభీర్​ ఫైర్​..!

By:  Tupaki Desk   |   18 March 2021 1:30 PM GMT
సూర్యకుమార్​ ను ఎందుకు తప్పించారు? గంభీర్​ ఫైర్​..!
X
ఇంగ్లండ్​తో జరగబోతున్న టీ20 మూడో మ్యాచ్​లో సూర్య కుమార్​ యాదవ్​ ను తప్పించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్​ లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఇషాంత్​ కిషన్​, సూర్యకుమార్​ కు ఈ టీ20 ద్వారానే అంతర్జాతీయ క్రికెట్​ లో ఆడే అవకాశం వచ్చింది. అయితే రెండో టీ20లో ఇషాంత్​ కిషన్​ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్​ చేసిన ఇషాంత్​ భారతజట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ ​లో సూర్య కుమార్​ కు ఆడే అవకాశం రాలేదు.

ఇదిలా ఉంటే మూడో టీ20 మ్యాచ్​ కు రోహిత్​ శర్మను తీసుకున్నారు. దీంతో సూర్యకుమార్​ను పక్కనపెట్టారు. అయితే రాహుల్​ను తప్పిస్తారని అంతా భావించారు. కానీ రోహిత్​ కోసం సూర్యకుమార్​ ను తప్పించడం పట్ల సోషల్​ మీడియా లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ అంశం పై మాజీ క్రికెటర్​ గంభీర్ కూడా స్పందించారు. కనీసం సూర్యకుమార్​ ఆడే అవకాశం ఇవ్వకుండా అతడిని ఎలా పక్కకు పెడతారంటూ గంభీర్​ విమర్శించారు. గంభీర్​ ఇంకా ఏమన్నాడంటే..

‘ టీం ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తీసుకున్న నిర్ణయం నన్నేంతో ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్య కుమార్​కు ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి ప్లేస్​లో ఇంకెవరినైనా పక్కకు పెట్టాల్సింది. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఇటువంటి టైంలో ఈ నిర్ణయం ఏ మాత్రం సరైంది కాదు. సూర్యకుమార్​కు గాయాలు లేవు. అతడికి అవకాశమే రానప్పుడు అతడి బ్యాటింగ్​ తీరును ఎలా అంచనావేస్తాం’ అంటూ గంభీర్​ ఫైర్​ అయ్యారు. సూర్య కుమార్ ​కు ఒక్క అవకాశం ఇచ్చి అతడు ఎలా ఆడతాడో చూడాల్సింది అంటూ గంభీర్​ పేర్కొన్నారు.

శ్రేయస్ అయ్యర్​ తో ఐదో స్థానం కోసం సూర్య కుమార్ యాదవ్ పోటీ పడుతున్నాడు. ఫస్ట్ టీ20లో 67 పరుగులతో ఆకట్టుకున్న శ్రేయస్.. తర్వాత మ్యాచ్​ల్లో వరుసగా 8, 9 పరుగులతో నిరాశపర్చాడు. దీంతో అతని స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆ స్థానంలో ఓ బ్యాకప్​ ప్లేయర్​ ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక మూడో టీ20లో భారత్​ ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లో ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేదు దీంతో చిత్తుగా ఓడింది. సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 8 వికెట్లతో ఘన విజయాన్నందుకొని సిరీస్‌ లో 2-1తో ముందంజ లో నిలిచింది. ఇవాళ నాలుగో మ్యాచ్​ జరుగనున్నది. ఈ మ్యాచ్​ ఇండియాకు చావో రేవో లాంటిది.