Begin typing your search above and press return to search.
వార్నర్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడాడు : గౌతమ్ గంభీర్ ట్విట్ వైరల్ !
By: Tupaki Desk | 12 Nov 2021 10:44 AM GMTటీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్ లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మొహ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో వార్నర్ ఒక షాట్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన హఫీజ్ తన తొలి బంతిని వార్నర్ కు విసిరాడు. అయితే బంతి వేయడంలో నియంత్రణ కోల్పోయిన హఫీజ్ క్రీజుకు దూరంగా విసిరాడు. ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్, రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని లెగ్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు.
అది ఏకంగా సిక్సర్‌గా వెళ్లింది. ఆ షాట్ చూసిన పాక్ కెప్టెన్ బాబర్ షాక్ అయ్యాడు. మాములుగా అయితే అంపైర్ దానిని డెడ్ బాల్ గా ప్రకటించాలి. అనూహ్యంగా నో బాల్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీనియర్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ చేసిన ఈ పనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా తన అసహనంను బయటపెట్టాడు. డేవిడ్ వార్నర్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. ఇది నిజంగా అవమానకరం. చాలా సిగ్గుగా ఉంది. ఈ విషయంపై ఏమంటావ్ రవిచంద్రన్ అశ్విన్ అని గంభీర్ ట్వీట్ చేశాడు. క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయాలపై చర్చలకు దిగే అశ్విన్ ను అభిప్రాయం అడగడంతో గంభీర్ కొత్త వివాదానికి తెరలేపాడు. ఈ ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అయింది.
గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ పై ఓ అభిమాని స్పందించాడు. అదీ కూడా తెలుగులో నువ్ ఏందిరా రా నాయనా మధ్యలో అంటూ ఆ అభిమాని ట్వీట్ చేశాడు. సెమీస్ మ్యాచులో వార్నర్ ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. అయితే తాను ఔటైన విధానాన్ని చూస్తే మాత్రం అతడిని దురదృష్టం వెంటాడింది. షాదాబ్ ఖాన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతి, వార్నర్ బ్యాటుకు తాకలేదు. కానీ పాక్ ప్లేయర్స్ అప్పీల్ చేయగానే, అంపైర్ ఔటిచ్చాడు. వార్నర్ కూడా తాను ఔటేమోనని భావించి బయటకి వెళ్ళిపోయాడు.