Begin typing your search above and press return to search.

ప్రైవేట్ పరం కానున్న గౌతమి, గోదావరి రైళ్లు !?

By:  Tupaki Desk   |   15 Dec 2020 10:21 AM GMT
ప్రైవేట్ పరం కానున్న గౌతమి, గోదావరి రైళ్లు !?
X
దేశంలో రైల్వే ను కొంచెం కొంచెం ప్రైవేట్ పరం చేసే పనులు ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని మేజర్ రైళ్లు ప్రైవేట్ పరం కాగా , తాజాగా విజయవాడ రైల్వే డివిజన్లలో గోదావరి, గౌతమి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు డివిజన్ అధికారులు దీనికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారట. ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా గోదావరి, గౌతమి ఎక్స్ ప్రెస్ రైళ్లలోని కోచ్ లు అన్నింటినీ ఏసీగా మార్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఇది జరిగితే కనక ఆ రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్ లని ఇక మర్చిపోవాల్సిందే. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ తర్వాత మిగిలిన కోచ్ లన్నీ థర్డ్ ఏసీ గానే ఉంటాయి. దీంతో పేద వర్గాలకు ఈ రైళ్లు దూరం కావడమేగాక మధ్యతరగతి వర్గాలకు ప్రయాణం భారంగా మారనుంది. ఇటీవల బిడ్డర్లతో నిర్వహించిన సమావేశంలో జరిగిన రహస్య ఒప్పందాల్లో ఈ రైళ్ల ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.