Begin typing your search above and press return to search.

టాప్ 10లో లేని అదానీ.. కానీ..

By:  Tupaki Desk   |   10 Jan 2023 8:24 AM GMT
టాప్ 10లో లేని అదానీ.. కానీ..
X
ప్రపంచంలో అపర కుబేరులు ఎలా అవుతారు.. సాధారణంగా వారి కంపెనీ ఉత్పత్తులు, ఆదాయం భారీగా ఉంటేనే వాళ్లు నంబర్ అవుతారు. కానీ మన ఘనత వహించిన భారతీయ నంబర్ 1 కుబేరుడు.. ప్రపంచంలోనే నంబర్ 3 ధనవంతుడు అయిన గౌతం అదానీ మాత్రం తన కంపెనీల సంపదతో ఈ స్థాయికి చేరుకోలేదు. అవును నిజంగా నిజం. తాజాగా 'మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న కంపెనీల జాబితాను' విడుదల చేశారు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలున్నాయి. వాటి అధినేతలు ప్రపంచ కుబేరుల్లో ఉన్నారు. కానీ మన గౌతం అదానీ కంపెనీ అందులో లేదు. మరి కంపెనీ లేకుండా మన అదానీ అంత కుబేరుడు ఎలా అయ్యాడంటే అంతా 'మోడీ సర్కార్ ' దయ వల్ల అని విమర్శకులు అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్యాపిటైలేషన్ ఉన్న కంపెనీల వివరాలు బయటకు వచ్చాయి. ప్రపంచంలోనే నంబర్ 3 కుబేరుడైన అదానీ కంపెనీ టాప్ 10 లో లేదు. మరి ఆయన ఎలా కుబేరుడయ్యాడంటే.. మోడీ సర్కార్ కట్టబెట్టిన కాంట్రాక్టుల వల్లనే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మార్కెట్ క్యాప్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు సాంకేతికత, కమ్యూనికేషన్ సేవలు, శక్తి, వినియోగదారు సైక్లికల్‌లు మరియు ఆర్థిక సేవలతో సహా వివిధ మార్కెట్ రంగాల పరిధిలో పనిచేస్తాయి. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది ఒక షేర్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధరతో బాకీ ఉన్న మొత్తం షేర్ల సంఖ్యను గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. టాప్-10 జాబితాలోని మెజారిటీ కంపెనీలు వందల కోట్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, వార్షిక ఆదాయంలో $100 బిలియన్ల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించే కొన్ని ఉన్నాయి, జాబితాలోని ఇతరులతో పోలిస్తే ఈ కంపెనీల సంభావ్య వృద్ధి గురించి పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉన్నారని సూచిస్తున్నారు.

అత్యధిక మార్కెట్ క్యాపిటైలేషన్ కలిగిన సంస్థగా 'యాపిల్' కంపెనీ అవతరించింది. దీని సంపద విలువ 2.08 ట్రలియన్ డాలర్లు. 2వ స్థానంలో అమెరికా ఎక్స్ఛేంజ్‌లో వర్తకం చేయని సౌదీ అరేబియా ఆయిల్‌ సంస్థ ప్రపంచంలోనే నంబర్ 2లో ఉంది.. 3వ స్థానంలో మైక్రోసాఫ్ట్, 3వ స్థానంలో అల్ఫాబెట్ (గూగుల్), 5వ స్థానంలో అమెజాన్, 6వ స్థానంలో బెర్క్ షైర్ హాతవ్ వే, 7వ స్థానాలో వీసా,8వ స్థానంలో జాన్సన్ అండ్ జాన్సన్, 9వ స్థానంలో యునైటెడ్ హెల్త్, 10వ స్థానంలో ఎక్సాన్ మొబిల్ కంపెనీలున్నాయి.

మార్కెట్ క్యాప్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు సాంకేతికత, కమ్యూనికేషన్ సేవలు, శక్తి, వినియోగదారు సైక్లికల్‌లు మరియు ఆర్థిక సేవలతో సహా వివిధ మార్కెట్ రంగాల పరిధిలో పనిచేస్తాయి. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది ఒక షేర్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధరతో బాకీ ఉన్న మొత్తం షేర్ల సంఖ్యను గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. టాప్-10 జాబితాలోని మెజారిటీ కంపెనీలు వందల కోట్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, వార్షిక ఆదాయంలో $100 బిలియన్ల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించే కొన్ని ఉన్నాయి, జాబితాలోని ఇతరులతో పోలిస్తే ఈ కంపెనీల సంభావ్య వృద్ధి గురించి పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉన్నారని సూచిస్తున్నారు.

కంపెనీల విలువలు తరచుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్‌లోని అన్ని షేర్ల విలువ ద్వారా కొలుస్తారు. 2022 నాటికి, యాపిల్, సౌదీ అరాంకో మరియు మైక్రోసాఫ్ట్ మొదటి మూడు స్థానాలను కలిగి ఉన్నాయి, ఒక్కొక్కటి $2 ట్రిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌లతో ఉన్నాయి. టెక్నాలజీ మరియు ఎనర్జీ కంపెనీలు నేడు ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా ఉన్నాయి. అమెరికా ఆధారిత కంపెనీలు చాలా టాప్ స్లాట్‌లను నింపుతాయి.

మార్కెట్ క్యాపిటలైజేషన్ లో లేని ప్రపంచంలోనే టాప్ 3 కుబేరుడిగా గౌతం అదానీ ఎలా అయ్యాడన్నది ప్రశ్న. టాప్ 10 కంపెనీల్లోనూ అదానీ కంపెనీ లేదు. మరి ఎలా అయ్యాడు. అదానీ కంపెనీ ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు.. ఎంప్లాయిస్ బేస్డ్ కూడా కాదు. కేవలం ప్రభుత్వం సపోర్టుతో ప్రపంచంలోనే టాప్ 3 కుబేరుగా గౌతం అదానీ అయ్యాడా? ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచిపెడితేనే ఈ స్థాయికి చేరాడా? అని గౌతం అదానీ సంపద తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిటిక్స్ విమర్శలు మొదలుపెడుతున్నారు. అదానీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వృద్ధి లేకుండా ఆయన ఎలా ఎదిగాడని ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతిని మోడీ సర్కార్ నే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.