Begin typing your search above and press return to search.
మళ్లీ పడ్డ అదానీ.. ఈసారి రెండు స్థానాలు ఫట్!
By: Tupaki Desk | 4 Oct 2022 10:41 AM GMTప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఇటీవల రెండో స్థానంలో నిలిచి రికార్డులు సృష్టించిన అదానీ మళ్లీ దిగువకు పడిపోయారు. రెండు రోజుల క్రితం మూడో స్థానంలోకి దిగజారిన గౌతమ్ అదానీ తాజాగా మరో ర్యాంకు కిందకు పడిపోయారు.
దీంతో ఆయన ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు.
కాగా ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ర్యాంక్ పడుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ఆయన రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోగా.. ప్రస్తుతం అది కూడా పోయి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మూడో ర్యాంకులో ఉన్నారు. ఇటీవల వరకు నాలుగో స్థానంలో ఉన్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ లూయిస్ వియుట్టన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానం దక్కించుకున్నారు.
కాగా స్టాక్ మార్కెట్ల నష్టాలతో గౌతమ్ అదానీ సంపద ఒక్క రోజులోనే 9.67 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఈ మేరకు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ఈ విషయాన్ని తెలిపింది.
ఫోర్బ్స్ ప్రకటించిన తాజా జాబితాలో వీరి సంపద వరుసగా ఎలాన్ మస్క్ 232.4 బిలియన్ డాలర్లు, లూయిస్ వియుట్టన్-150 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్-139 బిలియన్ డాలర్లు, అదానీ-120 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 107 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 95.58 బిలియన్ డాలర్లు, లారీ పేజ్ 91.8 బిలియన్ డాలర్లు, సెర్గీ బ్రిన్ 87.2 బిలియన్ డాలర్లుగా ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రపంచంలోనే పదో స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 81.9 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.