Begin typing your search above and press return to search.
జయలలిత మృతిపై అనుమానాలు.. ప్రధానికి గౌతమి లేఖ
By: Tupaki Desk | 9 Dec 2016 8:20 AM GMTజయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు.. ఇంకెన్నో సందేహాలు.. కానీ, ప్రశ్నించేవారు లేరు. నోరు మెదిపేవారు లేరు. ఇలాంటి సమయంలో జయ మృతిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ సీనియర్ నటి... ఇటీవలే కమల్ హాసన్ నుంచి విడిపోయిన నటి గౌతమి నేరుగా ప్రధాని మోడీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.
జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత, అక్కడ కోలుకున్నట్టు చెప్పారని, అంతలోనే మరణించినట్టు ప్రకటన వెల్లడించారని చెబుతూ, ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచారని గౌతమి ఆరోపించారు. వీఐపీలు వచ్చినా ఆమె దగ్గరికి వెళ్లనీయలేదని గుర్తు చేశారు.
జయలలిత అనారోగ్యం, అపోలో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరిగిన తీరు తదితరాలపై కలుగుతున్న అనుమానాలను ఎవరూ వ్యక్తంచేయడం లేదు. ఎందుకనో అంతా వెనుకంజ వేస్తున్నారు. కానీ, గౌతమి మాత్రం దీనిపై నేరుగా ప్రధానికే లేఖ రాశారు. అసలు అమ్మ ఆరోగ్యం విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటించారని ప్రశ్నిస్తూ, ఆమెకు జరిగిన చికిత్సపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని, వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. మోడీ దీనిపై స్పందిస్తారని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా జయ మృతి తరువాత రాజాజీ హాలులో ఆమె భౌతిక కాయం వద్ద గౌతమి చాలాసేపు గడిపారు. అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.