Begin typing your search above and press return to search.
హార్ధిక్ పాండ్యా పనైపోయింది.. పక్కనపెట్టడం బెటర్ అట?
By: Tupaki Desk | 29 July 2021 1:30 AM GMTటీమిండియా తరుఫున ఆడుతున్న హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ఆ యువ జట్టు తరుఫున ఆడుతూ ఇప్పటికే వన్డేల్లో తేలిపోయాడు. ఇప్పుడు టీ20లోనూ పెద్దగా రాణించడం లేదు.
ఒకప్పుడు టీమిండియా తరుఫున నంబర్ 1 ఆల్ రౌండర్ గా ఎదిగిన హార్ధిక్ పాండ్యా ఇప్పుడు బంతితో, బ్యాట్ తో ఏమాత్రం చెలరేగడం లేదు. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా ఎంట్రీ ఇచ్చి భారీ షాట్లతో ఉక్కిరిబిక్కిరి చేసే ఇతడు ఇప్పుడు సాధారణ ఆటగాడి ఆడడానికి ఆపసోపాలు పడుతున్నాడు. దీంతో విమర్శల పాలవుతున్నాడు.
ఈ క్రమంలోనే భారత లెజండరీ క్రికెటర్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్ధిక్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. హార్ధిక్ పాండ్యాకు ప్రత్యామ్మాయాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా పాండ్యాకు రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికోసం ఇద్దరి పేర్లను సైతం సూచించారు.
హార్ధిక్ పాండ్యాకు బదులుగా ఇద్దరి పేర్లను గవాస్కర్ సూచించాడు.నిలకడగా రాణిస్తున్న యువకులకు అవకాశం ఇవ్వాలని సూచించాడు.
హార్ధిక్ పాండ్యాను పక్కనపెట్టి దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ లతో ఆ స్థానాలను భర్తీ చేయాలని గవాస్కర్ సూచించాడు. వీరిద్దరూ ఐపీఎల్ లో విదేశీల్లో బ్యాటింగ్ లో కూడా రాణిస్తున్నారని తెలిపాడు.ఇటీవల శ్రీలంకలో దీపక్ చాహర్ ఏకంగా మ్యాచ్ ను గెలిపించాడని.. అతడి బౌలింగ్ బాగా ఉంటుందని సూచించాడు. 82 బంతుల్లో 69 పరుగులు చేసి దీపక్ చాహర్ శ్రీలంకతో మ్యాచ్ ను గెలిపించాడని తెలిపాడు. ఇక భువనేశ్వర్ సైతం 28 బంతుల్లో 19 పరుగులతో రాణించాడని తెలిపారు.
ఇప్పటికైనా టీమిండియా భువనేశ్వర్, దీపక్ చాహర్ లను ఆల్ రౌండర్లుగా గుర్తించి టీమిండియాలో అవకాశం ఇవ్వాలని సూచించింది. రెండు, మూడేళ్ల కింద ఎంఎస్ దోనితో కలిసి భువనేశ్వర్ కుమార్ జట్టును గెలిపించాడని రెండో వన్డేలోనూ అదే చేశాడని వీరిద్దరూ జట్టుకు ఆల్ రౌండర్ల కొరత తీరుస్తాడని గావస్కార్ అభిప్రాయపడ్డారు.