Begin typing your search above and press return to search.
ఢిల్లీ అమ్మాయితో డేటింగ్ కు గేల్ రెఢీ
By: Tupaki Desk | 6 May 2016 4:26 PM GMTవిలాసపురుషుడిగా..పార్టీ యానిమల్ గా.. అమ్మాయిలంటే తెగ పిచ్చెక్కిపోయే వ్యక్తిగా క్రిస్ గేల్ కు చాలానే ట్రాక్ రికార్డు ఉంది. అమ్మాయిల విషయంలో గేల్ గోలగోల చేస్తాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గేల్ సరదాగా ఢిల్లీ అమ్మాయితో డేటింగ్ కు రెఢీ కావటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఒక పిల్లకు తండ్రి అయిన గేల్ కు ఓ అమ్మాయితో డేటింగ్ చేయాలన్న పాడు బుద్ధేమిటి అని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దీని వెనుక చిన్నకథే ఉంది. ఢిల్లీకి చెందిన అరోహి అనే అమ్మాయికి క్రిస్ గేల్ అంటే చాలా ఇష్టం. అతడ్ని విపరీతంగా అభిమానిస్తుంది. అభిమానిగా ఆరాధిస్తుంది. ఆ అభిమానంతోనే అతగాడితో ఛాట్ చేస్తుండగా.. అరోహి ఒక కామెంట్ పోస్ట్ చేస్తూ.. ‘‘నీ కోసం నా హృదయం ఉవ్విళ్లూరుతుంది. డేట్ కి వెళదామా?’’ అంటూ ప్రపోజ్ చేస్తూ ట్వీట్ చేసింది.
దీనికి చిలిపిగా రియాక్ట్ అయిన గేల్.. ‘‘నువ్వు బిల్లు కడతానంటే తప్పకుండా వెళదాం’’ అని బదులిచ్చాడు. వెంటనే అరోహీ గేల్ సమాధానికి తనదైన శైలిలో రియాక్ట్ ఒకటి పెడుతూ.. ఒక షరతు పెట్టింది. ‘‘నీ కండీషన్ కు ఒప్పుకుంటున్నా. కానీ నాదీ ఒక షరతు ఉంది. వచ్చే ఐపీఎల్ లో నువ్వు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సెంచరీ కొట్టాలి’’ అంటూ ట్వీట్ చేసింది. ఢిల్లీ అమ్మాయితో గేల్ డేట్ కి వెళ్లాలంటే ఏడాది ఆగి.. సెంచరీ కొట్టిన తర్వాతేనన్న మాట. మొత్తమ్మీదా ఈ సంభాషణ సోషల్ మీడియాలో ఇప్పుడు హడావుడి చేస్తోంది.