Begin typing your search above and press return to search.

గేదెల శ్రీ‌నుబాబు మైండ్ బ్లాక్‌

By:  Tupaki Desk   |   17 March 2019 10:39 AM GMT
గేదెల శ్రీ‌నుబాబు మైండ్ బ్లాక్‌
X
గేదెల శ్రీ‌నుబాబు... మొన్నటి వ‌ర‌కు రాష్ట్రంలో చాలామందికి తెలియ‌దు. ఉత్త‌రాంధ్ర‌లో మాత్రం అత‌ను ఊరూరా పోస్ట‌ర్ల‌లో క‌నిపిస్తాడు. అనేక కార్య‌క్ర‌మాలతో హ‌డావుడి చేశాడు. పారిశ్రామిక వేత్త‌. అర్థ బ‌లం బాగుంది. చాలాకాలం నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున అత‌ను నిర్విరామంగా చేస్తున్న శ్ర‌మ‌కు జ‌న‌సేనాధిప‌తి అత‌నికి గుర్తింపు ఇచ్చాడు. వైజాగ్ ఎంపీ టిక్కెట్ ఇచ్చాడు. అయితే, శ్రీ‌నుబాబు ప‌వ‌న్‌ కు రాత్రికి రాత్రి ఓ పెద్ద షాక్ ఇచ్చాడు. అర్ధ‌రాత్రి పార్టీ మారి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అక్క‌డ టిక్కెట్ వ‌చ్చింది కాబ‌ట్టి ఇక్క‌డ కూడా టిక్కెట్ వ‌స్తుంది అనుకున్నాడు. క‌ట్ చేస్తే... సీన్ మారింది.

ఎంపీ టిక్కెట్ లేదు. ఎమ్మెల్యే టికెట్ లేదు. ఇపుడు ఆయ‌న జ‌స్ట్ వైసీపీ నాయ‌కుడు. వాస్త‌వానికి గేదెల ఏమ‌నుకున్నాడో తెలియ‌దు గాని జ‌గ‌న్ ముందు నుంచి ఒక ప్ర‌ణాళిక‌తో ఉన్నాడు. ఎప్ప‌ట్నుంచో గ్రౌండ్ వ‌ర్క్ చేసి అభ్య‌ర్థుల‌ను సెల‌క్ట్ చేస్తూ వ‌చ్చి ఈరోజు ప్ర‌క‌టించారు. స‌డెన్ గా ఇలా వ‌స్తే అలా టిక్కెట్ ఇవ్వ‌డానికి జ‌గ‌న్ ఏమీ అభ్య‌ర్థుల‌ను వెతుక్కునే ప‌రిస్థితుల్లో లేడు. అలా అని వ‌ద్ద‌నే మూర్ఖ‌త్వ‌మూ చూప‌రు. ఎవ‌రు వ‌చ్చినా తీసుకుంటారు. పార్టీ కోసం పాటుప‌డాలి. ఇక్క‌డ భ‌విష్య‌త్తు వెదుక్కోవాలి అనే రూట్లో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నాడు.

ఇదిలా ఉంటే... గేదెల రాత్రికిరాత్రి పార్టీ మారడం జ‌న‌సైనికుల‌కు చాలా కోపం తెప్పించింది. వారి కోపం క‌ట్ట‌లుతెంచ్చుకుని 24 గంట‌ల్లో గేదెల మీద వంద‌లాది అలిగేష‌న్స్ చేస్తూ పోస్టులు పెట్టారు. మ‌రి మార్పు కోసం ప‌వ‌న్ అనే ఈ అభిమానులు గేదెల అక్ర‌మాలు చేసి ఉంటే అవి తెలిసి ఎందుకు సైలెంట్‌గా ఉన్న‌ట్లో మ‌రి?