Begin typing your search above and press return to search.

గీత క‌థ‌లో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   19 Oct 2015 8:57 AM GMT
గీత క‌థ‌లో కొత్త ట్విస్ట్‌
X
కండ‌ల వీరుడు సల్మాన్ తాజా చిత్రం భ‌జ‌రంగీ భాయేజాన్ చిత్రం త‌ర్వాత విశేషంగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన పాక్ లో ఉన్న భార‌త్ అమ్మాయి గీత ఉదంతం తెలిసిందే. చిన్న వ‌య‌సులో త‌ల్లిదండ్రుల నుంచి విడిపోయి.. పాకిస్తాన్ కు చేరిన ఆమెను ఒక ఎన్జీవో చేర‌దీయ‌టం.. ఆమెను భార‌త్ కు తిరిగి తీసుకురావ‌టానికి వీలుగా భార‌త‌ స‌ర్కారు ఏర్పాట్లు చేస్తుండ‌టం తెలిసిందే.

ఈ నెల 26న పాక్ ఎన్జీవో సంస్థ ప్ర‌తినిధులు గీత‌ను తీసుకొని భార‌త్ కు రానున్న స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి మ‌రో ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గీత త‌ల్లిదండ్రులను గుర్తించే క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేసి.. గీత త‌మ అమ్మాయే అంటున్న వారిని గీత‌కు వీడియో కాలింగ్ ద్వారా చూపించ‌టం.. చివ‌ర‌కు బీహార్ కు చెందిన వారిని త‌న త‌ల్లిదండ్రులుగా గీత గుర్తించింది.

అయితే.. ప్ర‌స్తుతం వారు.. గీత‌కు సంబంధించిన కొత్త విష‌యాల్ని చెబుతున్నారు. త‌మ అమ్మాయికి మైన‌ర్ గా ఉన్న స‌మ‌యంలోనే ఉమేష్ అనే వ్య‌క్తితో పెళ్లి జ‌రిగింద‌ని ఆమె త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. మ‌రోవైపు త‌న‌కు అస‌లు పెళ్లి కాలేద‌ని గీత తెగేసి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ కు వ‌చ్చిన త‌ర్వాత‌.. గీత‌కు.. ఆమె త‌ల్లిదండ్రులుగా భావిస్తున్న వారికి డీఎన్ ఏ ప‌రీక్ష నిర్వ‌హించి ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తేల్చాల‌ని భావిస్తున్నారు. మ‌రి.. గీత క‌థ ఎప్ప‌టికి కంచికి చేరుతుందో..?