Begin typing your search above and press return to search.

భారత్ లో లింగ వివక్ష అప్పటికీ కానీ పోదు : ఐరాస అంచనా..!

By:  Tupaki Desk   |   2 Dec 2022 11:30 PM GMT
భారత్ లో లింగ వివక్ష అప్పటికీ కానీ పోదు : ఐరాస అంచనా..!
X
2030 నాటికి భారత్ స్త్రీ.. పురుష సమానత్వాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారత్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ పరిస్థితి లేదని ఐక్య రాజ్య సమితి మహిళా విభాగంగా యూఎన్ విమెన్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితులు మున్ముందు ఇలానే కొనసాగితే భారత్ లో స్త్రీ.. పురుష సమానత్వం సాధించడానికి ఇంకా 268 ఏళ్ళు పడుతుందని యూఎన్ విమెన్ అంచనా వేసింది.

ఐక్య రాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో స్త్రీ.. పురుష సమానత్వం అనే అంశముంది. జెండర్ ఆధారంగా స్త్రీ.. పురుషల మధ్య వ్యత్యాలను తొలగించడం ఐరాస సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఐరాస చట్టాల్లో బాలికలు.. మహిళలకు న్యాయ సేవలను చేరువ చేయాలని.. పనికి సమాన వేతనం.. ఉద్యోగాల్లో మహిళలకు అన్ని హక్కులు కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జెండర్ గ్యాప్ నివేదిక 2022 ప్రకారంగా స్త్రీ.. పురుషుల సమానత్వం జాబితాలో భరాత్ 135వ స్థానంలో ఉంది. 146 దేశాలల్లో డబ్ల్యూఈఎఫ్ నిర్వహించిన సర్వేలో భారత్ కింది నుంచి పైకి తొమ్మిదో స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఒకే పనికి స్త్రీ.. పురుషులకు సమాన వేతనం ఇచ్చే చట్టాలేవీ లేవని పేర్కొంది.

అలాగే పురుషుల తరహాలో స్త్రీ రాత్రి వేళల్లో పని చేసేందుకు అడ్డుకునే చట్టాలు భారత్ లో ఉండటం వల్ల జెండర్ ఈక్వేషన్లో వెనుకబడిందని పేర్కొంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగాలు లేకపోవడం.. మహిళలు కుటుంబ పోషణకే పరిమితం కావడం వంటి అంశాలు భారత్ ను వెనక్వెకి నెట్టేందుకు దోహదపడుతున్నట్లు వెల్లడైంది.

బ్రిటన్.. ఫ్యాన్స్.. జర్మనీ లాంటి దేశాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు చట్టపరంగా హక్కులు ఉన్నాయని జెండర్ గ్యాప్ నివేదికలో వెల్లడైంది. భారత్ కంటే చాలా దేశాలు ముందంజలో ఉండగా భారత్ మాత్రం ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. మహిళలు వ్యాపారాలు నడిపే విషయంలో వివక్ష లేకున్నప్పటికీ రుణాల మంజూరిలో మాత్రం వివక్ష కన్పిస్తుందని తేలింది.

జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ప్రకారంగా భారత్‌లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు కేవలం 2.8 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే సైన్స్.. టెక్నాలజీ.. ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లో మహిళా విద్యార్థుల వాటా 42.7 శాతం వరకూ ఉంది. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని నివేదికలో వెల్లడైంది.

భారత్‌లో సైన్స్ విభాగంలో పని చేస్తున్న మహిళల వాటా 17.35 శాతంగా ఉంది. ఈ విషయంలో బంగ్లాదేశ్.. చైనా.. అఫ్గానిస్తాన్.. శ్రీలంక కంటే భారత్ ఎంతో ముందుంది. మేనేజ్‌మెంట్.. నాయకత్వ పదవుల్లో భారత్‌లోని మహిళలు 18శాతం వాటాను కలిగి ఉంది. కాగా బ్రిటన్.. అమెరికాలో ఈ వాటా వరుసగా 30.. 40 శాతం ఉంది. ఈ విషయంలో శ్రీలంక భారత్ కంటే చాలా ముందుంది.

మొత్తానికి మహిళల విషయంలో భారత్ కొన్ని రంగాల్లో పురోగతి సాధించగా.. మరికొన్ని రంగాల్లో మాత్రం వెనుకబడి ఉన్నట్లు తేలింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పొలిస్తే భారత్ మహిళల విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ లో స్త్రీ.. పురుష సమానత్వం కోసం మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.