Begin typing your search above and press return to search.

20 ఏళ్ల తరువాత ముందడుగు.. :పూర్తయిన జీనోమ్ పరిశోధన

By:  Tupaki Desk   |   2 April 2022 9:48 AM GMT
20 ఏళ్ల తరువాత ముందడుగు.. :పూర్తయిన జీనోమ్ పరిశోధన
X
ఎట్టకేలకు మానవ జన్యుశాస్త్రం పూర్తయింది. మానవ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. జీవశాస్త్రంలో మానవ జన్యు ఆనుక్రమణ (జీనోమ్ సీక్వెన్సింగ్) పూర్తయినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించిన శాస్త్రవేత్తలు చివరికి అనుకున్నది సాధించారు. అయితే గతంలో మానవ జీనోమ్ ముసాయిదాను ప్రకటించారు. కానీ మిస్సింగ్ భాగాల అన్వేషణ కోసం చాలా ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జర్నల్ సైన్స్ లో ఈ విషయాన్ని ప్రచురించింది.

జీనోమ్ సీక్వెన్సింగ్ ను తొలిసారి 2000 సంవత్సరంలో అమెరికాలోని వైట్ హౌసజ్లో ప్రకటించారు. అంతర్జాతీయ ఫండింగ్ తో నడిచే యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థతో పాటు ప్రైవేట్ సంస్థ సెలెరా జీనోమిక్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని ప్రకటించాయి. మానవ జన్యు ఆనుక్రమణ 310 డీఎన్ఏ సబ్ యూనిట్లతో తయారైందని తెలిపారు. జీనోమ్ మ్యాప్ లో కీలకంగా పనిచేసేవాటిని గుర్తించామన్నారు. ఇందులో అమూల్యమైన సమాచారం ఉందని, కీలక జన్యువులు ఉన్నాయని చెప్పారు.

చింపాజీతో పోలిస్తే మనిషి మెదడు క్లిష్టంగా పెద్దదిగా జన్యువుల్లాంటిది ఇందులో ఉందని పేర్కొన్నారు. వీటిని కనుగునేందుకు క్రిప్టిక్ జెనిటిక్ లాంగ్వేజ్ ఉపయోగపడిదన్నారు. మానవ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలో జీవశాస్త్ర విశేషాల విశ్లేషణలో జీనోమ్ పూర్తి సీక్వెన్సింగ్ ఎంతగానో ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వృద్ధాప్యం, నరాల బలహీనత వ్యాధులు, క్యాన్సర్, హృద్రోగాల్లాంటి పలు సమస్యలకు దీని ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. డీన్ఏ మానవ జీవనానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. సుమారు 30 వేల జీన్స్ ఉంటాయి. ఇవి 23 గ్రూపులుగా ఏర్పడుతాయి. ప్రతీ కణం కేంద్రకంలో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి.

మనిషిని తయారు చేసే కొన్ని జన్యువులు ఇంతకాలం జీనోమ్ డార్క్ మేటర్లో ఉన్నాయని, వీటిని ఇంతవరకు మిస్సయ్యాయని శాస్త్రవేత్త బష్లర్ చెప్పారు. కానీ వీటిని తాజా పరిశోధనలో ఛేదించామన్నారు. ఈ ఖాళీలలను అర్థం చేసుకోవడానికి 20 ఏళ్లు పట్టిందన్నారు. గతంలో మిస్సయిన దాదాపు 8 శాతం జీనోమ్ ను సైతం విశ్లేషించి పూర్తి జీనోమ్ ను తయారు చేసినట్లు పరిశోధకులు తెలిపారు. వీటిని కనుగొనేందుకు క్రిప్టిక్ జెనిటిక్ లాంగ్వేజ్ ఉపయోగపడిందన్నారు. మానవ వైవిద్యతకు ప్రతిబింబాలైన మనుషుల జీనోమ్ ఇక టీ 2టీ గ్రూప్ తో కలిసి పనిచేస్తుందన్నారు.