Begin typing your search above and press return to search.
నాటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ కరోనాను అప్పట్లోనే ఊహించారా?
By: Tupaki Desk | 11 April 2020 1:00 AM ISTకరోనా వైరస్ గురించి అప్పుడెప్పుడో పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారంటూ కొన్ని నెలల క్రితం ఒక పోస్టు విపరీతంగా వైరల్ గా మారటమే.. చివరకు వాటిని చెక్ చేసుకోకుండానే మీడియాలోనూ వచ్చేయటం తెలిసిందే. తర్వాతి కాలంలో వీరబ్రహ్మం అలాంటి మాటను అస్సలు చెప్పలేదని తేల్చారు.
ఇదిలా ఉంటే.. గతంలో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన జూనియర్ జార్జిబుష్.. కరోనా మహమ్మారిని ముందే ఊహించారా? అన్న సందేహం తాజా వీడియోను చూసిన వారికి అనిపించక మానదు. 2005లో అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంటువ్యాధి కార్చిచ్చు లాంటిది. దాన్ని ఎంత త్వరగా నియంత్రిస్తే.. అంత తక్కువ నష్టం జరుగుతుంది. లేని పక్షంలో దాని కారణంగా జరిగే నష్టం ఊహకు కూడా అందదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అంటువ్యాధుల విషయంలో అగ్రరాజ్యం అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఇప్పుడీ దుస్థితిన అన్న భావన వ్యక్తమవుతోంది.