Begin typing your search above and press return to search.
చైనాకు షాకిచ్చిన జర్మనీ: నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
By: Tupaki Desk | 21 April 2020 4:15 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీని కారణంగా తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థతో పాటు మొత్తం ప్రపంచ విపణి తీరని నష్టాల్లో కూరుకుపోయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని అమెరికాతో పాటు చాలా దేశాలు ఆరోపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్‌డం (యూకే), ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ కూడా చైనాను విమర్శిస్తూ తాము నష్టపోయిన దానికి పరిహారం చెల్లించాలని ఏకంగా చైనాకు లేఖ రాసింది.
కరోనాకు జన్మనిచ్చిన చైనా ఆ వైరస్ వ్యాప్తి కారణమని, ఈ క్రమంలో ఆ వైరస్ వలన తాము నష్టపోయిన మొత్తాన్ని చైనా చెల్లించాలని ఈ సందర్భంగా జర్మనీ డిమాండ్ చేసింది. కరోనా వైరస్ వలన తమ దేశంలో తీవ్రంగా నష్టపోయామని, ఈ సందర్భంగా 130 బిలియన్ల బ్రిటీష్ పౌండ్లు చెల్లించాలంటూ చైనాకు ఇన్‌వాయిస్ పంపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పర్యాటక రంగం ఆదాయంలో 27 బిలియన్ యూరోల నష్టం, సినిమా రంగంలో 7.2 బిలియన్ యూరోల నష్టం, విమానయానం, ఇతర వ్యాపార కార్యకలాపాల నిలిపివేతతో నష్టపోయిన 50 బిలియన్ యూరోలను తమకు చెల్లించాలని జర్మనీ చైనాను డిమాండ్ చేసింది. వైరస్ పుట్టుకకు కారణమైన చైనా ఆ ఆర్థిక నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత చైనాదేనని స్పష్టం చేసింది.
అయితే దీనిపై స్పందించిన చైనా బదులిచ్చింది. జాతీయవాదం, జినోఫోబియాను రెచ్చ గొట్టడంలో భాగంగా అలా చేశారని చైనా వెల్లడించింది. ఈ సందర్భంగా జర్మనీ చేసిన విజ్ఞప్తిని కొట్టిపారేశారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చేశారని చైనాపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చైనా, అమెరికా మధ్య పరస్పర విమర్శలు, ప్రతివిమర్శలు వస్తుండడంతో ఆ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.