Begin typing your search above and press return to search.

ఇక‌.. అమెరికా అత్యుత్త‌మ దేశం కాదు

By:  Tupaki Desk   |   22 Jan 2016 1:30 AM GMT
ఇక‌.. అమెరికా అత్యుత్త‌మ దేశం కాదు
X
అమెరికా పేరు చెప్పిన వెంట‌నే దాని గొప్ప‌త‌నం వ‌ర్ణించ‌టానికి చాలానే విష‌యాలు చెప్పేస్తుంటారు. అమెరికా గొప్ప ఇంత‌.. అంత అంటూ పొగిడేస్తుంటారు. అయితే.. ఇక‌పై అలాంటి పొగడ్త‌లు పొగిడే ముందు కాస్త ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ దేశం ఏమిటన్న ప్ర‌శ్న నోటి నుంచి వ‌చ్చిన వెంట‌నే.. మ‌రో ఆలోచ‌న లేకుండా త‌డుముకోకుండా అమెరికా పేరు చెప్పేయ‌టం మామూలే.

కానీ.. అలాంటి ప‌రిస్థితి ఇక‌పై ఉండ‌ద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ప్ర‌పంచంలో అత్యుత్తమ దేశంగా అమెరికాకు ఉన్న పేరు ప్ర‌ఖ్యాతులతో పాటు.. ఆ దేశానికి అంత సీన్ లేద‌ని తాజాగా తేల్చేశారు. తాజాగా ఆ హోదాను కోల్పోయిన అమెరికా స్థానంలో జ‌ర్మ‌నీ వ‌చ్చేసింది.

యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్ట‌న్ స్కూల్ అండ్ గ్లోబ‌ల్ బ్రాండ్ క‌న్స‌ల్టెంట్లు ప్ర‌పంచంలో అత్యుత్త‌మ దేశాల జాబితాను త‌యారు చేస్తూ ఉంటాయి. తాజాగా త‌యారు చేసిన జాబితాలో అమెరికా పేరు మిస్ అయ్యింది. మారిన ప‌రిస్థితుల‌తో ప్రపంచంలో అత్యుత్త‌మ దేశం అమెరికా కాదు.. జ‌ర్మ‌నీగా తేల్చారు.

మ‌రింత దారుణ‌మైన అంశం ఏమిటంటే.. జ‌ర్మ‌నీ త‌ర్వాత కెన‌డా.. బ్రిట‌న్‌.. ఆ త‌ర్వాత అమెరికా నిల‌వ‌టం గ‌మ‌నార్హం. అంటే.. గ‌త కొన్నేళ్లుగా మొద‌టి స్థానంలో ఉన్న అమెరికా.. త‌న ఫ‌స్ట్‌ప్లేస్ ను కోల్పోవ‌ట‌మే కాదు..ఏకంగా నాలుగో స్థానానికి దిగ‌జారిపోయింది. అత్యుత్త‌మ దేశం హోదాతో పాటు ప‌లు ఇత‌ర హోదాల్లోనూ అమెరికా కాకుండా వేర్వేరు దేశాలు ఎంపిక కావ‌టం గ‌మ‌నార్హం. కొంత‌లో కొంత సంతోష‌క‌ర‌మైన అంశం.. శ‌క్తివంత‌మైన దేశంగా మాత్రం అమెరికానే నిలిచింది.

వివిధ విభాగాల్లో అత్యుత్త‌మ దేశాలు చూస్తే..

శ‌క్తివంత‌మైన దేశం: అమెరికా
ఉత్త‌మ పౌరులు.. చిన్నారుల పెంప‌కం: స‌్వీడ‌న్‌
ఉత్త‌మ సాహ‌స‌కృత్య దేశం: బ‌్రెజిల్‌
ఉత్త‌మ క్రీడ‌ల దేశం: స‌్వీడ‌న్‌
ఉత్త‌మ వ్యాపార అనుకూల దేశం: ల‌క్సెంబ‌ర్గ్
ఉత్త‌మ మెరుగైన జీవ‌నం: కెన‌డా
ఉత్త‌మ సంప్ర‌దాయ దేశం: ఇట‌లీ
ఉత్త‌మ అప్‌ క‌మింగ్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌: భార‌త దేశం
ఉత్త‌మ ఔత్సాహికులున్న దేశం: జ‌ర్మ‌నీ