Begin typing your search above and press return to search.
వెంటనే దిగు లేదంటే బట్టలు విప్పేస్తా!
By: Tupaki Desk | 5 Aug 2019 3:15 PM GMTమెట్రో నగరాల్లో క్యాబ్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉబర్ మరియు ఓలా క్యాబ్స్ లలో రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అక్కడక్కడ కస్టమర్లను వేదించడం.. ముఖ్యంగా లేడీస్ తో క్యాబ్ డ్రైవర్ లు దురుసగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉన్నారు. తాజాగా ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రవర్తించిన తీరు లేడీస్ రాత్రి సమయంలో క్యాబ్ ఎక్కాలంటే భయపడే పరిస్థితిని తీసుకు వచ్చింది. అర్థరాత్రి సమయంలో నడి రోడ్డుపై క్యాబ్ ఆపి వెంటనే తన కారులోంచి దిగి పోవాలని లేదంటే డ్రస్ విప్పి నానా రచ్చ చేస్తానంటూ హెచ్చరించాడట.
బెంగళూరుకు చెందిన అపర్ణ అనే ఒక టెక్కీ ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆమె ఎదుర్కొన్న భయానక పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఆమె మాటల్లో.. నా జీవితంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ఘటన ఒకటి మీతో షేర్ చేసుకోవాలుకుంటున్నాను. గత రాత్రి నేను నా స్నేహితులతో కలిసి ఒక పార్టీకి వెళ్లాను. అక్కడ పార్టీ ముగిసిన తర్వాత స్నేహితులు నన్ను ఒక క్యాబ్ బుక్ చేసి పంపించారు. క్యాబ్ వచ్చిన తర్వాత నేను ఎక్కాను. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత అతడు ఒక స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడుతూ తన కారులో ఎక్కే వారి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతడి మాటలను నేనేం పట్టించుకోలేదు.
ఫోన్ పెట్టిన తర్వాత నావైపు తిరిగి చదువుకున్నదానిలా ఉన్నావు. డ్యూటీ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లక పార్టీలు ఏంటీ అంటూ నన్ను ప్రశ్నించాడు. రాత్రి 7 గంటల లోపు ఇంటికి వెళ్లక స్నేహితులతో కలిసి ఎందుకు తాగుతారు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు నేను ఏం తాగలేదు.. అయినా నా గురించి నీకు ఎందుకు అన్నాను. దీంతో అతడు నాపై తీవ్ర ఆగ్రహంతో విరుచుకు పడ్డాడు. నన్ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు. అతడి ప్రవర్తనతో నాకు భయం వేసి ఉబర్ సేఫ్టీ బటన్ నొక్కాను. దాంతో వెంటనే ఉబర్ కస్టమర్ కేర్ నుండి అతడికి కాల్ వచ్చింది. అతడు వారితో మాట్లాడుతూ ఆమె బాగా తాగి ఉంది.. నేను ఆమెతో బాగానే ప్రవర్తిస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. నేను పదే పదే కస్టమర్ కేర్ కు ప్రయత్నించినా కూడా అది అతడికే వెళ్తుంది.
చివరకు నన్ను మరో క్యాబ్ లో ఎక్కించేందుకు ఉబర్ వారు ఒప్పుకున్నారు. అయితే అప్పుడే కారు ఆపి వెంటనే నా కారు దిగు. లేదంటే బట్టలు విప్పేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో నేను దిగాను. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత నేను అక్కడ దిగాను. ఆ సమయంలో ఉబర్ నుండి నాకు వేరే క్యాబ్ ఏమీ రాలేదు. మళ్లీ స్నేహితులు క్యాబ్ బుక్ చేస్తే నేను దాంట్లో ఇంటికి చేరుకున్నాను. ఉబర్ సంస్థ వారు కస్టమర్లకు ఎలాంటి సెక్యూరిటీని కల్పిస్తున్నారనే విషయం ఈ సంఘటనతో వెళ్లడయ్యిందని ఆపర్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. అపర్ణ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఉబర్ సంస్థ ఆ క్యాబ్ డ్రైవర్ పై చర్యలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.