Begin typing your search above and press return to search.
కరోనా గుట్టు బయట పెట్టండి .. బైడెన్ కీలక ఆదేశాలు !
By: Tupaki Desk | 27 May 2021 5:30 AM GMTకరోనా వైరస్ గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న అతి పెద్ద సమస్య. అయితే అసలు ఈ మహమ్మారి ఎక్కడ పుట్టింది, మొదటగా ఎలా వ్యాపించింది, గత ఏడాదిన్నర కాలంగా ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతుకుతూనే ఉన్నారు పరిశోధకులు. ప్రపంచ శాస్త్రవేత్తలు, అధికారులు సైతం ఇదే పని మీద కసరత్తులు చేస్తున్నారు. అయితే సరైన సమాధానం మాత్రం దొరకడం లేదు. చైనా వైరస్ అని అమెరికా... కాదు కాదు వాళ్ల దగ్గరిదే అని చైనా వాళ్లు కొన్నాళ్లు వాదించుకున్నారు. ముఖ్యంగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అయితే కరోనా వైరస్ ను ఏకంగా చైనా వైరస్ అంటూ విరుచుపడ్డాడు. ఈ విషయంలో చైనా , అమెరికా మధ్య తీవ్రమైన పొరపచ్చలు వచ్చాయి.
ఆ తర్వాత బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత దీనిపై సమగ్ర విచారణ ను చేపట్టారు. కరోనా వైరస్ పుట్టుకకి గల కారణాలు తెలుసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ఇంటిలిజెన్స్ వ్యవస్థ ను ఆదేశించారు . 90 రోజుల్లో సరైన సమగ్ర నివేదిక అందించాలని అన్నారు. చైనా లో కరోనా వైరస్ ల్యాబ్స్ నుండి మనుషులకి సోకిందా , లేదా జంతువుల నుండి మనుషులకి సోకిందా అనేది తెలుసుకోవాలని అన్నారు. గత నెలలోనే దీనిపై నివేదిక అందినప్పటికీ ఇంకా కొన్ని కీలక అంశాలు రాబట్టాలని కోరారు. అయితే తాజాగా కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే పుట్టుకొచ్చిందని కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ దీనికి సంబంధించి ఓ కథనం ప్రచురించింది. వైరస్ విషయం బయటకు రావడానికి ముందే వుహాన్ ల్యాబ్ లో ముగ్గురు శాస్త్రవేత్తలు కరోనా బారిన పడ్డారని అందులో వెల్లడించారు.
అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికల ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురింది. అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఫాక్ట్ షీట్ లోని కొన్ని విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి. దీంతో కరోనా విషయంలో మరోసారి చైనా పాత్ర బయటపడింది. ప్రపంచానికి సార్స్ కోవ్-2 వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్‌లో కొంతమంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారని వాల్ స్ట్రీట్ కథనం వెల్లడించింది. వారికి సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడి దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. నిజానికి చైనాలోని వుహాన్‌లో డిసెంబర్ 8,2019న తొలి సార్స్ కోవ్-2 కేసు నమోదైంది. అయితే అంతకంటే ముందే అక్కడ కరోనా వైరస్ ఉందని చాలా మంది వైరాలజీ వైద్యులు, అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. ఆ ఏడాది నవంబర్‌లోనే వుహాన్‌లో సార్క్ కోవ్-2 వ్యాపించి ఉంటుందని వాళ్లు చెబుతున్నారు. చైనా మీద ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనావైరస్ లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం బయటకు ఇవ్వడం లేదు.