Begin typing your search above and press return to search.
టీకా తీసుకో .. బిల్లులో డిస్కౌంట్ అందుకో !
By: Tupaki Desk | 12 July 2021 4:00 AM GMTభారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాక్సినేషన్ డ్రైవ్ శరవేగంగా కొనసాగుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వడంతో మొదలుపెట్టిన ఈ డ్రైవ్ ఇప్పటికి ఇంకా అదే వేగంతో కొనసాగుతుంది. భారత్ మాదిరే చాలా దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతోంది. అయితే , కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకున్న వారికి డిస్కౌంట్లు ప్రకటించింది. కరోనా టీకాను అందరూ తీసుకోవాలని.. ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆఫర్స్ ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనాను కట్టడి చేయాలంటే సరైన మార్గం వ్యాక్సిన్ మాత్రమే. ఇంత ప్రచారం చేసి, అవగాహన కల్పిస్తోన్న కొందరు మాత్రం టీకాలు వేసుకోవడం లేదు.
అలాంటి వారి కోసం కొన్ని రెస్టారెంట్లు ఆఫర్ ప్రకటించాయి. వ్యాక్సిన్ వేసుకున్నారో ఆ హోటల్స్ లో రాయితీ ఉంటుంది. డోసుల వారీగా కూడా డిస్కౌంట్ ఉంటుంది. రాజస్తాన్ లో ఓ హోటల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే .. రాజస్తాన్ జోధ్ పూర్ లో వెదిక్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ ఉంది. జనం వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే బిల్లులో 10 శాతం రాయితీ అని ప్రకటించింది. అదే రెండు డోసులు తీసుకుంటే 20 శాతం అని తెలియజేసింది. ఈ ఆఫర్ మంచిదే.. ఎందుకంటే చాలా మందిని వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. కరోనా టీకాను జనం వేసుకునేలా ప్రోత్సహించేందుకు ఆఫర్ ప్రకటించామని రెస్టారెంట్ యాజమని తెలిపారు. ఈ ఒక్క హోటల్ మాత్రమే కాదు రాజస్తాన్ లో పలు కంపెనీలు ఇలా ఆఫర్ ప్రకటిస్తున్నాయి. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్ లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది.
వచ్చే నెలలో థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో అందరూ ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. ఇక ,వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే అందుకోసం విధిగా మాస్క్ ధరించి,శానిటైజర్ రాసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించాల్సిందే. ఇకపోతే , గతంలోను దుబాయ్ లోని గేట్స్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో నడిచే మూడు హోటల్స్ లో ఈ తరహా డిస్కౌంట్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకుంటే హోటల్ బిల్లులో 10 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఇక రెండో డోస్ కూడా తీసుకున్న వారికి 20 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఐతే టీకా తీసుకున్నట్లుగా మెడికల్ సర్టిఫికెట్ చూపించాలని ఒక కండిషన్ పెట్టింది. స్ప్రెడ్ లవ్.. నాట్ రోనా ట్యాగ్ లైన్ తో ఈ కార్యక్రమం చేపట్టింది గేట్స్ హాస్పిటాలిటీ. తమిళనాడు మధురైలోని ఓ సెలూన్లోనూ ఇలానే 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ రిపోర్టును సమర్పిస్తే.. ఈ డిస్కౌంట్ను అందిస్తామని సెలూన్ యజమాని ప్రకటించారు. ప్రజల్లో టీకాపై అవగాహన పెంచేందుకే ఇలా చేస్తున్నామన్నారు. మరికొన్ని ప్రదేశాల్లో.. ఆరోగ్యసిబ్బందికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. ఉచితంగా పార్కింగ్ సౌకర్యం, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నామని ఓ షాపింగ్మాల్ యజమాని తెలిపారు. దీని వల్ల ప్రజలు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని.. దాంతో పాటు తమకూ లాభదాయకంగా ఉందని వారు చెప్తున్నారు.