Begin typing your search above and press return to search.
కోడి కొంచెం.. పప్పు ఘనం
By: Tupaki Desk | 17 Sep 2015 4:55 PM GMT'ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్' అన్న సామెత తెలిసిందే కదా.. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో ఈ సామెత నిజమైంది. వాడుకలో ఈ సామెత అర్థం వేరైనా దేశంలో చికెన్ - పప్పుల ధరలను పోల్చుకున్నప్పుడు ముర్గీ(కోడి), దాల్(పప్పు) ధరలు సమానమయ్యాయని మొన్నమొన్నటి వరకు అనుకున్నారు. కానీ గత నెల రోజులుగా ఈ సామెతను మార్చి చెప్పుకోవాల్సి వస్తోంది. ''ముర్గీ దాల్ సే సాస్థా'' అని చెప్పుకోవాల్సి వస్తోంది. దేశంలో పప్పుల ధరలు పరిశీలిస్తే ఈ మాట నూటికి నూరు పాళ్లు నిజం అని అంగీకరించాల్సిందే.
కొద్ది రోజులుగా పప్పుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఉల్లి ధరకు తోడుగా పప్పులూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కందిపప్పు ధర కిలో రూ.160 అంత కంటే ఎక్కువ కూడా ఉంది. ఇతర పప్పు దినుసుల ధరలూ భారీగా పెరిగాయి. అదే సమయంలో కేజీ చికెన్ గరిష్ఠంగా రూ.120 మాత్రమే ఉంది. అది కూడా పూర్తిగా శుభ్రపరిచిన స్కిన్ లెస్ చికెన్ ధర. అలా కాకుండా డ్రెస్డ్ అయితే రూ.100 అంతకంటే తక్కువకు కూడా దొరుకుతోంది. దీంతో సోషల్ మీడియాలో ప్రజలు ఈ ధరలను పోలుస్తూ ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అంటూ తెగ సెటైర్లు వేస్తున్నారు. తాజా ధరల ప్రకారం చికెన్ కంటే కందిపప్పు ధర రూ.40 అంతకంటే అధికంగా ఉండడంతో ముర్గీ దాల్ సే సాస్థా అనుకోవాల్సి వస్తోంది.
అదేసమయంలో మిగతా వస్తువల ధరలూ పరుగులు తీస్తున్నాయి. ఆధార్ కార్డులు ప్రవేశపెట్టిన సందర్భంలో అన్నిటికీ అదే ఆధారమంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది... దాంతో అప్పట్లో ఉల్లిపాయలు కొనాలన్నా ఆధార్ అడుగుతారా ఏంటి అంటూ సెటైర్లు వేసుకున్నారు. కానీ ఉల్లిధరలు పెరగడం.. ప్రభుత్వాలు రైతుబజార్లలో తక్కువ ధరకు విక్రయిస్తుండడం.. అందుకు ఆధార్ కార్డు చూపించమనడంతో ఆ మాటా నిజమైంది. భవిష్యత్ లో నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని ప్రపంచమంతా భావిస్తుంటే రైతు బజార్ల వద్ద మాత్రం ఉల్లిపాయల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి కొనుగోలు కోసం మహిళలు కుస్తీ పడుతున్నారు. భారీ ఎత్తున జనం రావడంతో క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకెళ్లడంతో...నిర్వాహకులకు వారిని అదుపుచేయడం కష్టంగా మారింది. చివరకు పోలీసు బందోబస్తు కూడా పెట్టాల్సి వస్తోంది.
మొత్తానికి దేశంలో ధరల ప్రభావంతో సామెతలు, సెటైర్లు.. ఊహాగానాలు అన్నీ నిజమైపోతున్నాయి. ధరలు కిందకు దిగిరావడమే కలగా మిగిలిపోతోంది. సామాన్యులందరి కామన్ కోరిక అయిన చౌకధరలు మాత్రం సాధ్యం కావడం లేదు.