Begin typing your search above and press return to search.

గజల్ శ్రీనివాస్‌ కు బెయిల్ మంజూరు

By:  Tupaki Desk   |   24 Jan 2018 10:06 AM GMT
గజల్ శ్రీనివాస్‌ కు బెయిల్ మంజూరు
X
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌ కు కాస్త ఊర‌ట ద‌క్కింది. ఆలయవాణి రేడియోను నడుపుతూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న గజల్ శ్రీనివాస్‌ పై 2017 - డిసెంబర్ 29వ తేదీన బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు జనవరి 2న అతనిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌ కు తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ. 10 వేల నగదు - ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రతి బుధవారం - ఆదివారం పంజాగుట్ట ఎస్‌ ఐ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ2 నిందితురాలు పార్వతికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి.. ఖైరతాబాద్ ఆనంద్‌ నగర్‌ లో నిర్వహిస్తున్న సేవ్ టెంపుల్ అనే సంస్థ పేర నిర్వహిస్తున్న ఆలయవాణి రేడియోలో జాకీగా ఉద్యోగంలో చేరి ఇంచార్జి అయ్యింది. సంస్థ యజమానులు ఆమెరికాలో ఉండగా గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే, యువతిపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. మసాజ్ చేయాలని వెకిలి ప్రవర్తనతో లైంగిక వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆమె ముందు బట్టలు విప్పి గంతులేశాడు. తాను చెప్పినట్టు చేస్తే ఆర్థికంగా ఆదుకుంటానని, మంచి పొజిషన్‌ లోకి తెస్తానని ఆశ చూపాడు.

గజల్ శ్రీనివాస్ వద్ద పీఏగా పనిచేసే పార్వతి అనే మహిళ తాను మసాజ్ చేస్తానని, నువ్వు కూడా మసాజ్ చేయాలని ఒత్తిడి తెచ్చింది. బాధితురాలు ఉద్యోగం మానేద్దామనుకోగా - గజల్ శ్రీనివాస్ అడ్డుచెప్పాడు. ఎక్స్‌ పీరియెన్స్ సర్టిఫికెట్ కూడా ఇవ్వనని బెదిరించాడు. అవమానాలు - వేధింపులు దిగమింగుకుంటూ గజల్ వికృత చేష్టలపై సాక్ష్యాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంత‌రం గ‌త ఏడాది డిసెంబ‌ర్ 29న ఆయ‌న్ను అరెస్టు చేశారు.