Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఇంటికి అనుమతులు
By: Tupaki Desk | 17 Aug 2015 5:04 AM GMTఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అనుమతుల విషయంలో కొద్దిరోజులుగా తర్జనభర్జన జరుగుతోంది. ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65... కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వేనెంబర్ 120లో నివాస గృహ నిర్మాణం అనుమతి నిమిత్తం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ మే 18,2015లో జీహెచ్ ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఇంటి ప్లాన్ విషయంలో తేడాలున్నాయని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇవ్వకుండా తిరస్కరించింది.
అప్పట్లో జీహెచ్ ఎంసీ ఆమోదించిన లే అవుట్ అనుసరించి భవనం ఎత్తు... భవన నిర్మాణ సెట్ బ్యాక్ లలో నిబంధనలు అతిక్రమించేవిగా ఉన్నాయని జీహెచ్ ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ అనుమతి పొందకుండానే పిల్లర్లు వేసినందునే తాము 30 రోజుల్లోనే ఆ దరఖాస్తును తిప్పిపంపినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఓటుకు నోటు తర్వాత జరిగిన ఈ పరిణామాలతో తెరాస ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా ఇలా చేస్తోందంటూ చంద్రబాబు కూడా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన క్యాబినెట్ లో రాష్ర్ట విభజన చట్టం సెక్షన్ -8 ప్రకారం తన ఇంటికి ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. సెక్షన్ -8 అమల్లోకి రాకపోవడం వల్ల తనతో పాటు ఏపీ ప్రజలందరు హైదరాబాద్ లో ఇబ్బందులు పడుతున్నారని తెరాస ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
తాజాగా చంద్రబాబు ఇంటికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అనుమతులు ఇవ్వడంతో ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన అక్కడకు వెళ్లి ఇంటి నిర్మాణం ఎలా జరుగుతోందో అడిగి తెలుసుకున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు ఇంటి ప్లాన్ ను పెండింగ్ లో పెట్టిన గ్రేటర్ అధికారులు ఇప్పటికిప్పుడు సడెన్ గా ఎందుకు అఫ్రూవల్ చేశారన్నది అంతుచిక్కడం లేదు.