Begin typing your search above and press return to search.
సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి మున్సిపల్ కార్పోరేషన్ జీహెచ్ ఎంసీ
By: Tupaki Desk | 8 Feb 2020 4:23 PM GMTగత కొన్ని నెలలుగా సీఏఏ - ఎన్ ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటికి పోటీగా కూడా అనుకూల ర్యాలీలు తీస్తున్నారు. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయి. సీఏఏకు వ్యతిరేకంగా తాము అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాము సీఏఏకు వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే దేశ్యాప్తంగా చర్చనీయాంశమైన సీఏఏ - ఎన్నార్సీలకు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ తీర్మానం చేసింది. ఇలా తీర్మానం చేసిన మొదటి కార్పోరేషన్ జీహెచ్ ఎంసీ కావడం గమనార్హం.
సీఏఏ - ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి మున్సిపాలిటీ తెలుగు రాష్ట్రాలకు కావడం గమనార్హం. జీహెచ్ ఎంసీ శనివారం జరిగిన సమావేశంలో సీఏఏ - ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తిర్మానాన్ని బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. మజ్లిస్ సభ్యులు ఆమోదం తెలిపారు.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాగానే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మజ్లిస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్ తమ పార్టీ విధానం కూడా అదేనని చెబుతూ తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు ముందుకొచ్చారు. ఇది జీహెచ్ ఎంసీకి సంబంధం లేని అంశమని - తీర్మానం ఏమిటని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.
మజ్లిస్ - టీఆర్ ఎస్ మిత్రపక్షాలు. పైగా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి సంఖ్యా బలం లేదు. దీంతో తీర్మానం ఆమోదం పొందింది. జీహెచ్ ఎంసీలో ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం పొందిన విషయాన్ని మజ్లిస్ అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి మున్సిపాలిటీ హైదరాబాద్ అని - ఈ తీర్మానాన్ని మాజీ మేయర్ - మజ్లిస్ కార్పోరేటర్ మాజీద్ హుస్సేన్ ప్రతిపాదించగా - బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆమోదం లభించిందని పేర్కొన్నారు.