Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రి ఓట్లు తేలాయి!

By:  Tupaki Desk   |   23 Jan 2018 4:54 AM GMT
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రి ఓట్లు తేలాయి!
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఓట్ల లెక్క‌ల‌పై నెల‌కొన్న వివాదం ఇప్ప‌ట్లో స‌మిసిపోయేలా లేదు. ఎందుకంటే.. ఆ మ‌ధ్యన దాదాపు 17 ల‌క్ష‌ల ఓట్ల వ‌ర‌కూ త‌గ్గించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించింది. స‌మ‌గ్ర ఓట‌రు స‌ర్వే అనంత‌రం గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఓట్ల సంఖ్య భారీగా త‌గ్గ‌టంపై విమ‌ర్శ‌లు వినిపించాయి. రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉండ‌టం.. మ‌ర‌ణాలు.. ఇత‌ర కార‌ణాల‌తో భారీ ఎత్తున ఓట్లు త‌గ్గిన‌ట్లుగా చెబుతున్న‌ప్ప‌టికీ.. ఓట‌రు స‌ర్వే స‌రిగా జ‌ర‌గ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి.

సెప్టెంబ‌రులో షురూ చేసిన స‌మ‌గ్ర ఓట‌రు స‌ర్వేను ఇంటింటికి ట్యాబ్ ల‌తో ఆప‌రేట‌ర్లు ఇంటింటికి తిరిగి స‌ర్వే చేసిన‌ట్లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఓట్ల స‌ర్వే లోప‌భూయిష్టంగా సాగింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఓట‌ర్ల స‌ర్వేను పూర్తి చేసి తుది జాబితాను తాజాగా ఫైన‌ల్ చేశారు. దీని ప్ర‌కారం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఓట‌ర్ల సంఖ్య 13.46 శాతం త‌గ్గింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో 82,64,604 ఓట్లు ఉండ‌గా.. ప్ర‌స్తుతం 71,52,415 ఓట్లు మాత్ర‌మే ఉన్న‌ట్లుగా తేల్చారు.

మొత్తం 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు చోట్ల ఓట్ల శాతం పెర‌గ్గా.. మిగిలిన అన్నిచోట్ల ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గ‌టం గ‌మ‌నార్హం. ఓట‌ర్ల సంఖ్య పెరిగిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే యాక‌త్ పురాలో స‌ర్వేకు ముందు కంటే త‌ర్వాత 452 ఓట్లు పెరిగాయి. చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో అయితే ఏకంగా 15,739 ఓట్లు పెర‌గ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. శివారు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ శాతం ఓట్లు ర‌ద్దు అయ్యాయి. కుత్భుల్లాపూర్ లో ఓట‌ర్ల జాబితాలో 2,19,756 ఓట్లు ర‌ద్దు కాగా.. మ‌హేశ్వ‌రంలో 1,11,373 ఓట్లు.. ఎల్బీ న‌గ‌ర్ లో 1,35,209.. మ‌ల్కాజిగిరిలో 1,08,332.. కూక‌ట్ ప‌ల్లిలో 92,528.. గోషామ‌హాల్ లో 54,221.. ప‌టాన్ చెరులో 53,631 ఓట్లు త‌గ్గాయి. పైన పేర్కొన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌బుల్ డిజిట్ల‌లో భారీగా ఓట్లు త‌గ్గితే.. ముషీరాబాద్ (3.7).. ముషీరాబాద్ (5.7).. మ‌ల‌క్ పేట (3.2).. ఖైర‌తాబాద్ (9).. జూబ్లీహిల్స్ (5.8).. స‌న‌త్ న‌గ‌ర్ (7.5).. నాంప‌ల్లి (5).. కార్వాన్ (0.6).. చార్మినార్ (3.2).. బ‌హ‌దూర్ పుర (6).. సికింద్రాబాద్ (.8.3).. కంటోన్మెంట్ (8.7).. రాజేంద్ర‌న‌గ‌ర్ (6.6).. శేరిలింగంప‌ల్లి (10.5) శాతం త‌గ్గాయి.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో 2011 జ‌నాభా లెక్క‌ల కంటే ఎక్కువ‌మంది ఓటు హ‌క్కు క‌లిగిన వారు ఉండ‌టం విశేషం. మ‌ల‌క్ పేట‌లో 102శాతం.. అంబ‌ర్ పేట‌లో 101.. యాకుత్ పుర 102.. శేరిలింగంప‌ల్లి 101 శాతం ఓట్లు ఉండ‌గా.. ముషీరాబాద్ లో 99 శాతం.. జూబ్లీహిల్స్ లో 98 శాతం.. స‌న‌త్ న‌గ‌ర్ లో 95 శాతం.. నాంప‌ల్లిలో 93 శాతం.. కార్వాన్ లో 91 శాతం.. సికింద్రాబాద్ లో 90 శాతం మంది ప్ర‌జ‌లు ఓట‌ర్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ అంకెల్ని చూస్తే.. ఓట‌ర్ల స‌మ‌గ్ర స‌ర్వే ఎంత బాగా జ‌రిగిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఏమైనా.. మ‌రికొద్ది నెలల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న మాట నేత‌ల నోట వినిపిస్తున్న వేళ‌.. ఓట‌ర్ల జాబితాలో ఓట్లు ఉన్నాయో లేవోన‌న్న విష‌యాన్ని చెక్ చేసుకోవ‌టం మంచిది. ఓట్లు మిస్ అయిన వారు.. మ‌ళ్లీ త‌మ ఓట్ల‌ను న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకైనా మంచిది మీ ఓటు ఉందో లేదో ఒక‌సారి చెక్ చేసుకోండి.