Begin typing your search above and press return to search.

ఇంట్లో మనిషిని ఉంచి కూల్చేశారే

By:  Tupaki Desk   |   24 Oct 2015 3:59 PM IST
ఇంట్లో మనిషిని ఉంచి కూల్చేశారే
X
అక్రమ కట్టడాల విషయంలో అప్పుడప్పుడు నిద్ర లేచి.. కన్నెర్ర చేసే జీహెచ్ ఎంసీ తాజాగా మరోమారు ఆవలించి.. ఒళ్లు విరుచుకొని ప్రొక్లయిన్లు బయటకు తీశారు. ఈ క్రమంలో చాలా పెద్ద తప్పు చేసేశారు. నగరంలో జవహర్ నగర్ లోని ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. వెనుకా ముందు చూసుకోకుండా ప్రొక్లెయినర్ కి పని చెప్పారు.

పై కప్పు కూల్చిన వెంటనే.. ఇంట్లో నుంచి మూలుగులు వినపడటంతో ఒక్కసారి అలెర్ట్ అయ్యారు. చేస్తున్న పని ఆపి..శిధిలాలు కింద ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అంటే.. అక్రమ కట్టడం అన్న విషయాన్ని చూసేసి కూల్చేయటమే కాదు.. అందులో ఎవరైనా ఉన్నారా? లేదా? లాంటివి కూడా చెక్ చేసుకోకుండా పని చేయటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

గ్రేటర్ అధికారుల ఓవరాక్షన్ తో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. శిధిలాలు తొలగించి.. సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇక.. ఆ వ్యక్తి ఎవరు? అన్నది తేలాల్సి ఉంది.ఇంత హడావుడిగా ఇంటిని కూల్చేయాల్సిన అవసరం ఏమటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏమైనా జీహెచ్ఎంసీ అధికారుల తీరును పలువురు తప్పు పడుతున్నారు.