Begin typing your search above and press return to search.
గ్రేటర్ షెడ్యూల్ రిలీజ్.. డిసెంబరు 1న పోలింగ్
By: Tupaki Desk | 17 Nov 2020 9:30 AM GMTఅంచనాలకు తగ్గట్లే పోలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొదట్నించి చెబుతున్నట్లుగా దీపావళి తర్వాత రోజు కానీ ఆ పక్క రోజు కానీ అన్న అంచనాలకు తగ్గట్లే.. ఈ రోజు గ్రేటర్ షెడ్యూల్ ను విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి. రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలువుతుందన్నారు. డిసెంబరు ఒకటిన పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నట్లు చెప్పిన ఎన్నికల కమిషనర్.. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. బుధవారం నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 20వరకు సాగుతుంది. అంటే..నామినేషన్లకు కేవలం రెండు రోజుల మాత్రమే గడువు ఉన్నట్లు. 21న నామినేషన్ల పరిశీలన సాగుతుందని.. ఉపసంహరణకు 24 చివరి తేదీగా పేర్కొన్నారు.
డిసెంబరు ఒకటిన పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 4న చేపడతారు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఇలాంటివేళ.. ప్రకటించిన షెడ్యూల్ చూస్తే.. నామినేషన్ల దాఖలకు చాలా తక్కువ సమయం ఉందని చెప్పక తప్పదు.