Begin typing your search above and press return to search.
గ్రేటర్ లో వాళ్ల ఖర్చు 700 కోట్లు
By: Tupaki Desk | 20 Jan 2016 9:30 PM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. విజయంపై భరోసాతో ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిదని గెలుపుకోసం అన్నిరకాల మార్గాలను ఆయా పార్టీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ, అభ్యర్థి, ఇతర సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో... డబ్బులకు కూడా అంతే విలువ ఇస్తున్నాయి. ఇలా బల్దియా బరిలో ఉన్న పార్టీల ఖర్చు లెక్కలు చూస్తే కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితి.
అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటికీ గ్రేటర్ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కావటంతో సీనియర్లు, వ్యక్తిత్వం, ప్రజలతో సన్నిహితం లాంటి అంశాలను పక్కనపెట్టేశాయి. గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా ఆశావహుల ఆర్ధిక స్థోమతతోనే టిక్కెట్లు కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కోపార్టీకి ఒక్కో అంశం కలిసి వస్తోంది. తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్ ఎస్ కు అధికార బలం ఎటూ ఉన్నది కాబట్టి అర్థబలం కూడా తోడవటం పెద్ద విషయం కాదు. అందుకనే ఎన్నికల్లో గెలవటానికి అవసరమైన నిధులు వ్యయం చేయగల స్ధోమత ఉన్న వారిలో అత్యధికులు అధికార పార్టీ తరపునే పోటీ చేయటానికే ఆసక్తి చూపుతున్నారు. అప్పోసప్పో చేసి ఇపుడు ఖర్చు పెట్టి గెలిస్తే చాలనే ఆలోచనతోనే పలువురు టీఆర్ ఎస్ ను ఆశ్రయించడంతో మిగిలిన పార్టీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్దితే కాస్త బెటర్. మొన్నటి వరకూ ఏకదాటిగా పదేళ్లు అధికారంలో ఉండబట్టి కాంగ్రెస్ నేతలు ఖర్చుపెట్టుకునే స్ధితిలోనే ఉన్నారు. అదే టీడీపీ-భాజపా పరిస్దితి దయనీయంగా మారింది. తెలంగాణ టీడీపీ అయితే ఏకంగా గడచిన పదేళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉండటమే కాకుండా మరో ఐదేళ్ళపాటు ప్రతిపక్షంలోనే కొనసాగాల్పిరావటం ఇబ్బందిగా మారింది. కాకపోతే ఏపీలో అధికారంలో ఉండటం కాస్త ఊరట. ఇక, భాజపా కూడా కేంద్రపార్టీపైనే ఆధారపడింది. అయితే, భాజపా అభ్యర్ధుల ఎన్నికల వ్యయం కూడా మిత్రపక్షమైన టీడీపీపైనే పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తోంది.
ఖర్చు చేయడంలో ఈ డివిజన్ ఆ డివిజన్ అన్న తేడాలే లేవని విశ్లేషకులు అంటున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతీ డివిజన్‌లోనూ ఒక్కో అభ్యర్ధికి సగటున ఏకంగా కోటి రూపాయల వరకూ వ్యయం అవుతుందని అంచనా. దీంతో అన్నీ పార్టీలకు చెందిన అభ్యర్ధుల వ్యయం అంచనా సుమారు 700 కోట్లు దాటిపోయే అవకాశాలే ఉన్నాయి.
కొసమెరుపుః గ్రేటర్ ఎన్నికల్లో బరిలో ఉండటం లేదని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రకటించింది. ఇందుకు ఆ పార్టీ చెప్పిన కారణం ఆసక్తికరం! అధికారంలో ఉన్నారు కాబట్టి టీఆర్ ఎస్ నేతలు, కేంద్రంలో,ఏపీలో మిత్రపక్ష పాలన కొనసాగిస్తున్న టీడీపీ-బీజేపీ నేతలు సంపాదించుకుంటున్నారు, ఇన్నేళ్లు పవర్‌లో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద సొమ్ములున్నాయని పేర్కొంటూ....తమ స్థోమత అంత లేదు కాబట్టే పోరుకు దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది!