Begin typing your search above and press return to search.
గ్రేటర్ మేజిక్ మార్కు 103
By: Tupaki Desk | 14 Jan 2016 3:30 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సొంతంగా అధికారాన్ని దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా 103 సీట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇవి ఎన్నికైన డివిజన్లు మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలు - ఎంపీల ఓట్లతో కలిపి.
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం డివిజన్లు 150. దాని ప్రకారం 76 సీట్లు ఎవరికి వస్తే వాళ్లు విజయం సాధించినట్లే. వాళ్లకే మేయర్ పీఠం దక్కుతుంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేషన్ చట్టం ఉంటుంది. దాని ప్రకారం దాని పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యులు అవుతారు. మేయర్ను ఎంపిక చేసే విషయంలో వారిది కూడా కీలక పాత్ర అవుతుంది.
గ్రేటర్ పరిధిలో మొత్తం 55 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అంటే, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కు ఉంటుందన్నమాట. అయితే, సదరు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్కడి నుంచి అయినా ఎన్నిక కావచ్చు. కానీ, వాళ్లకు ఓటు హక్కు మాత్రం గ్రేటర్ పరిధిలో ఉండాల్సి ఉంటుంది. అందుకే కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్ వంటి వాళ్లకు గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉంది. దాంతో జీహెచ్ ఎంసీలో వాళ్లు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 55 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారని జీహెచ్ఎంసీ అధికార వర్గాలు గుర్తించాయి. వీరిలో అత్యధికంగా 24 మంది టీఆర్ఎస్ కు; పదిమంది మజ్లిస్ కు ఉన్నారు. ఇక టీడీపీ, బీజేపీలకు చెరో ఏడుగురు ఉంటే.. కాంగ్రెస్ కు మరో ఏడుగురు ఉన్నారు. టీఆర్ ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యుల్లో అత్యధికులు కాంగ్రెస్, టీడీపీల నుంచి వెళ్లిపోయినవాళ్లే కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికలో వీళ్లంతా కీలకం కానున్నారు.