Begin typing your search above and press return to search.
గ్రేటర్ నామినేషన్లలో మహా గందరగోళం
By: Tupaki Desk | 18 Jan 2016 4:32 AM GMTగ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. 150 స్థానాలున్న గ్రేటర్ లో వివిధ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కళ్లు తిరగాల్సిందే. చివరి నిమిషం వరకూ అభ్యర్థుల ప్రకటనలో చోటు చేసుకున్న హడావుడికి చివరకు పరిస్థితిని గందరగోళంగా మార్చేసింది. ఎవరికి వారు అన్నట్లుగా నామినేషన్లు దాఖలు చేయటంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి 4,069 నామినేషన్లు దాఖలయ్యాయి.
150 స్థానాలున్న గ్రేటర్ లో పార్టీల తరఫున దాఖలైన నామినేషన్లు భారీగా సాగాయి. ప్రధాన పార్టీల్లో ఒక్క మజ్లిస్ లోనూ కాస్తంత క్లారిటీగా నామినేషన్లను దాఖలు చేయించిన దాఖలాలు కనిపించాయి. మిగిలిన ప్రధాన పార్టీల్లో ఎవరు నామినేషన్లు వేశారో అర్థం కాని పరిస్థితి. వివిధ పార్టీల తరఫున దాఖలైన నామినేషన్ల సంఖ్యను చూస్తేనే నామినేషన్ల పర్వం ఎంత కంగాళీగా మారిందో ఇట్లే అర్థమవుతుంది. చివర్లో చోటు చేసుకున్న హడావుడితో ముందైతే నామినేషన్లు వేయండి.. తర్వాత ఎవరు బరిలో ఉండాలో.. ఎవరు విత్ డ్రా కావాలో డిసైడ్ చేద్దామని పార్టీలు భావించటంతో నామినేషన్లు భారీగా నమోదైన పరిస్థితి.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి వివిధ పార్టీల తరఫున దాఖలైన నామినేషన్లు..
= టీఆర్ ఎస్ 888
= కాంగ్రెస్ 698
= టీడీపీ 688
= బీజేపీ 456
= బీఎస్పీ 108
= ఎంఐఎం 89
= ఇతరులు 78
= లోక్ సత్తా 49
= సీపీఐ 35
= సీపీఎం 35
= వైఎస్సార్ కాంగ్రెస్ 6
= ఇండిపెండెంట్లు 939