Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎన్నికలపై సుప్రీం ఎందుకిలా చేసింది?
By: Tupaki Desk | 28 Dec 2015 4:31 PM GMTతెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని వారే కాకుండా తెలుగువారందరిలో తీవ్ర ఆసక్తి రేపుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అటు సుప్రీంకోర్టు - ఇటు రాష్ర్ట ప్రభుత్వం ఏకకాలంలో ఒకే రీతిలో ఈ తరహా సమాచారాన్ని తెరమీదకు తేవడం గమనార్హం.
తెలంగాణ రాష్ర్ట ఎన్నికల అధికారి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ లోని మొత్తం 150 వార్డులకు రెండు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వేషన్ ఎంపిక ప్ర్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 31వ తేది లోగా ఎన్నికలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ అంతా జీహెచ్ ఎంసీ కమిషనరే చూస్తారని తెలిపారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం భారీ ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తామని ఎన్నికల అధికారి చెప్పారు.. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించామని, దాని ద్వారా ఓటర్లు తమ ఓటు వివరాలు, పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చునని తెలిపారు.
ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జీహెచ్ ఎంసీలో 7.9 లక్షల ఓట్లను తొలగించారంటూ హైదరాబాద్ వాసి మహేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల తొలగింపుపై పూర్తి విచారణ జరిపేవరకూ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ సమస్య తీవ్రతను గుర్తించినప్పటికీ ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
బల్దియా పోరుకు మరో రెండంటే రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయితే.. భాగ్యనగరంలో ఒక్కసారిగా రాజకీయ జోరు పెరుగుతుందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది.