Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ నోటిఫికేష‌న్ తేదీలు మారాయి

By:  Tupaki Desk   |   7 Jan 2016 8:04 AM GMT
గ్రేట‌ర్ నోటిఫికేష‌న్ తేదీలు మారాయి
X
రాజ‌కీయాలు ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంటాయో...అందులో చాణ‌క్యుడిలాంటి వ్యూహ‌క‌ర్త‌లు ఉన్న‌పుడు వాటి మ‌జా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే గ్రేట‌ర్ హైదరాబాద్ ఎన్నిక‌ల ఎపిసోడ్‌ ను చూడాలి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్రేటర్ హైద‌రాబాద్‌ ఎన్నికల ప్రక్రియ‌లో డైలామా కొనసాగుతూనే ఉంది. ఇవాళ, రేపు అంటున్నా వార్డుల‌ రిజర్వేషన్ల షెడ్యూలు ఇంకా రిలీజ్ కాకపోవడంతో అందరిలో టెన్షన్ ఏర్పడింది. మ‌రోవైపు నోటిఫికేషన్ వెలువ‌డ‌టంపై ఉన్న గందరగోళం అలాగే కొన‌సాగుతోంది.

ఇప్పటికే వార్డుల వారి రిజర్వేషన్ల వివ‌రాల‌ను సర్కారుకు పంపిన జీహెచ్ ఎంసీ ప్రభుత్వ ఆమోదం కోసం వెయిట్ చేస్తోంది. అయితే ఈ ప్ర‌క్రియ‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట్టాలు ఉన్నాయ‌ని చెప్తున్నారు. రిజర్వేషన్ల సిద్ధం చేయ‌డంలో అధికారులు చాలా జాగ్రత్త పడ్డారని స‌మాచారం. రిజర్వేషన్ల జాబితాను రెండు సీల్డ్ కవర్లలో ప్రభుత్వానికి పంపారని, రిజర్వేషన్ లిస్ట్ పైనల్ చేయ‌డం ముగ్గురు ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొన్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ డ్రాప్ట్ పైనల్ కాపీ రెడీ అవగానే సాప్ట్ కాపీలన్నీ కమిషనర్ డిలీట్ చేసి బయటకి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారని జీహెచ్ ఎంసీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

మ‌రోవైపు తెలంగాణ సర్కార్ మున్సిపల్ చ‌ట్టాన్ని సవరిస్తూ జీవో ఇవ్వడంతో ఇప్పుడు పోలింగ్ తేదీల‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. నోటిఫికేషన్‌ కు- పోలింగ్ మధ్య గడువు 15 రోజులకు తగ్గించడంతో పోలింగ్ 23న అనుకుంటున్నప్ప‌టికీ తాజా ప‌రిస్థితి చూస్తే అది కూడా ఛేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌ తో పాటు రిజర్వేషన్లు కూడా ఈ వారంలో ఇవ్వాలని బల్దియా వ‌ర్గాలు సిద్ధం చేస్తున్నార‌ట‌.

ఈనెల 9న అంటే శనివారం రిజర్వేషన్లు ప్రకటించి…10న షెడ్యూల్ విడుద‌ల చేసి 11న నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా అయితే ఎవరైనా కోర్టుకెళ్లడానికి కూడా ఛాన్స్ ఉండదు. మ‌రోవైపు అప్పటిలోగా అటు పొలిటికల్ పార్టీలు కూడా తమ అభ్య ర్థులను ఎంపిక చేసుకోడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గ్రేటర్ ఎలక్షన్ నోటిఫికేషన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. అటు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేక ఇటు బల్దియా నుంచి సమాచారం లేక…ఆశావాహులు కన్ప్యూజన్ తో రోజులు గడుపుతున్నారు.