Begin typing your search above and press return to search.
ఇంతకీ.. గ్రేటర్ ఎన్నికలు జరిగేదెప్పుడు..?
By: Tupaki Desk | 8 Jan 2016 4:35 AM GMTగ్రేటర్ ఎన్నికల నిర్వహణను కుదిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. అందుకు అనుగుణంగా నిబంధనలు మార్చేయటం తెలిసింది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే.. అందుకు స్పందించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. దీంతో.. పాత నిబంధనల ప్రకారమే గ్రేటర్ ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. సంక్రాంతి సెలవులు అయిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికల ప్రక్రియ మొత్తం జనవరి నెలాఖరులోపు పూర్తి అవుతుందని భావిస్తున్న వేళ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
హైకోర్టు విధించిన స్టే నేపథ్యంలో పాత నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం గ్రేటర్ ఎన్నికల్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తే.. తాజాగా హైకోర్టు స్టే కారణంగా ఈ ప్రక్రియ 21 నుంచి 29 రోజుల వరకూ పట్టే వీలుంది. ఈ రోజుకు ఈ రోజు వార్డుల రిజర్వేషన్ల వివరాల్ని తెలంగాణ సర్కారు విడుదల చేస్తే.. ఒక రోజు తర్వాత అంటే శనివారం కానీ లేదంటే ఆదివారం కానీ గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్దంగా ఉంది.
అంటే.. శని..ఆదివారాల్లో ఎన్నికల సంఘం కానీ నోటిఫికేషన్ జారీ చేసినా.. గ్రేటర్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరిగే వీలుంది. జనవరి చివరి నాటికి గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే స్థానే పిబ్రవరి రెండో వారం వరకూ గ్రేటర్ ఎన్నికల సందడి కంటిన్యూ కావటం ఖాయం.