Begin typing your search above and press return to search.

ఫోరమ్ , జీవీకే మాల్స్ కి భారీ జరిమానా విధించిన GHMC .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   23 Sep 2020 4:00 PM GMT
ఫోరమ్ , జీవీకే మాల్స్ కి భారీ జరిమానా విధించిన GHMC .. ఎందుకంటే ?
X
జీహెచ్ ఎం సీ లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు నగరవాసులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పలు శంకుస్థాపనలు.. అభివృద్ధి పేరిట చేసే హడావుడి చేస్తుంటే, ప్రతిపక్షాలు సైతం ప్రచారం కాలనీల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీహెచ్ ఎం సీ అధికారులు సైతం మేమేమీ తక్కువ కాదన్నట్లు పనులు చేస్తుండటం గమనార్హం.

ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలపై మొద్దునిద్ర పోతున్న అధికారులు ఉన్నట్టుండి భారీ జరిమానాలు వేస్తుండటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీహెచ్ ఎం సీ అధికారులు నగరంలో స్పెషల్ డ్రైవ్ పేరిట తిరుగుతున్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. బ్యానర్లు, హోర్డింగులను తొలగించడంతో పాటు నిర్వాహకులకు భారీ జరిమానాలు విధిస్తూ షాకిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదంటూ కూకట్ ‌పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్ ‌కు జీహెచ్ ఎం సీ ఎన్ ‌ఫోర్స్ ‌మెంట్ అధికారులు ఏకంగా రూ.4లక్షల జరిమానా విధించారు. సుజనా మాల్స్‌ కు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ జరిమానా పేరిట మొత్తంగా రూ.16 లక్షల50వేల జరిమానా విధించినట్లు తెలస్తోంది. దీంతోపాటు ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్ ‌కు రూ. 2లక్షలు.. బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్ ‌కు రూ. 2లక్షల జరిమానాను జీహెచ్ ఎం సీ అధికారులు విధించారు.