Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మేయర్ పేషీలో మొన్న అటెండర్.. నిన్న డ్రైవర్.. ఇవాళ మాటేంటి?
By: Tupaki Desk | 12 Jun 2020 6:15 AM GMTమిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కోకుండా పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న నేతగా హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ కు పేరుంది. అనూహ్యంగా మేయర్ పదవిని చేపట్టిన ఆయన మీద పలువురు ఆరోపణలు చేసినా.. అవేమీ పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో మాత్రం కనిపించలేదు. వచ్చే ఏడాది మొదట్లోనే హైదరాబాద్ మహానగర సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటివేళ.. ఊహించని విధంగా తెర మీదకు వచ్చింది మాయదారి రోగం.
మిగిలిన ప్రజాప్రతినిధులతో పోలిస్తే.. మేయర్ బొంతుకు దూకుడు ఎక్కువ. సహాయక కార్యక్రమాలు మొదలు అధికారిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ఆయన.. తరచూ మంత్రి కేటీఆర్ ను కలుస్తుంటారు. ఆయనతో భేటీ అవుతుంటారు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆయన సన్నిహితులు పలువురు బొంతును జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ఒక కార్యక్రమానికి హాజరైన మేయర్.. ఒక టిఫిన్ సెంటర్ కు వెళ్లారు. తర్వాతి రోజున ఆ టిఫిన్ సెంటర్ లో పని చేసే వ్యక్తికి పాజిటివ్ రావటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే.. పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే..గడిచిన రెండు రోజులుగా మేయర్ పేషీకి చెందిన వారికి పాజిటివ్ లు కన్ఫర్మ్ కావటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం జీహెచ్ఎంసీలోని మేయర్ పేషీలో పని చేసే అటెండర్ కు పాజిటివ్ రాగా.. గురువారం సాయంత్రం మేయర్ డ్రైవర్ కు పాజిటివ్ వచ్చినట్లుగా తేల్చారు. దీంతో.. మరోసారి మేయర్ బొంతు వార్తల్లోకి వచ్చారు. ఆయన కారు డ్రైవర్ కు పాజిటివ్ వచ్చిన వేళలో.. కాంటాక్టు చాలా సన్నిహితంగా ఉండే వీలుందన్న వాదన వినిపిస్తోంది. వరసపెట్టి రెండు రోజులుగా తనకు దగ్గరగా ఉండేవారు పాజిటివ్ లుగా నమోదవుతున్న వేళ.. మేయర్ మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) ఉదయమే మేయర్ నిర్దారణ టెస్టు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంటకు గురి చేస్తోంది.