Begin typing your search above and press return to search.

ఉమ్మడి లెక్క; బీసీ జనరల్ కే గ్రేటర్ మేయర్ పీఠం

By:  Tupaki Desk   |   9 Jan 2016 4:16 AM GMT
ఉమ్మడి లెక్క; బీసీ జనరల్ కే గ్రేటర్ మేయర్ పీఠం
X
గ్రేటర్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. గ్రేటర్ పరిధిలోని రిజర్వేషన్ల వార్డుల ఎంపిక పూర్తి చేయటం.. ఆ జాబితాను విడుదల చేయటంతో గ్రేటర్ గంట మోగింది. ఇక.. గ్రేటర్ ఎన్నికల అధికారి డాక్టర్ జనార్దన్ రెడ్డి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్ల లెక్క తేల్చారు.

ఇక.. గ్రేటర్ మేయర్ పదవి గతంలో నిర్ణయించిన రీతిలోనే బీసీ జనరల్ కు దక్కనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ ఎంపిక ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన రిజర్వేషన్లకు అనుగుణంగా సాగటం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లోని కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలకు వేర్వేరుగా రిజర్వేషన్ల ఆధారంగా మేయర్ పదవి ఏ వర్గాలకు దక్కాలో డిసైడ్ చేశారు. ఈ క్రమంలో గతంలో అన్ రిజర్వ్ కేటగిరిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీసీ జనరల్ కు దక్కింది. తాజాగా జరగనున్న మేయర్ ఎంపికకు ఇదే రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తారు.

గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లలో 76 మంది మద్దతు పొందిన కార్పొరేటర్ గ్రేటర్ మేయర్ గా ఎంపిక అవుతారు. కాకుంటే.. సదరు వ్యక్తి బీసీ జనరల్ వర్గానికి చెందిన వారై ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించిన రోస్టర్ విధానంలోనే తాజా మేయర్ ఎన్నిక రిజర్వేషన్ ను నిర్ణయించారు.