Begin typing your search above and press return to search.
లైసెన్స్ తీసుకోకుండా యాపారం చేస్తున్న పీవీఆర్
By: Tupaki Desk | 27 Aug 2019 5:28 AM GMTవ్యాపారం ఏదైనా దానికి లైసెన్స్ చాలా ముఖ్యం. రోడ్డు పక్కన చిన్న దుకాణాలు సైతం ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్న వేళ.. దేశంలోని ప్రముఖ మల్టీఫ్లెక్స్ సంస్థల్లో ఒకటైన పీవీఆర్ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయటం విస్మయానికి గురి చేసింది. ఒక పెద్ద మల్టీఫ్లెక్స్ ను నిర్మించి.. దాని కార్యకలాపాల్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వేళ.. సదరు మల్టీఫ్లెక్స్ నిర్వహించటానికి అవసరమైన ప్రాధమిక ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా పని చేస్తుండటం విశేషం.
హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఈ మధ్యన ఏర్పాటు చేసిన పీవీఆర్ మల్టీఫ్లెక్స్ ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. సాధారణంగా పెద్ద పెద్ద సంస్థలు.. తమ ఔట్ లెట్స్ ను ఓపెన్ చేసే సమయంలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారన్న నమ్మకం ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ ఉండదన్న భావనను కలుగజేసేలా చేసింది పీవీఆర్ మల్టీఫ్లెక్స్ యాజమాన్యం.
తాజాగా జీహెచ్ ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. లైసెన్స్ తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించారు. తాజాగా నోటీసులు జారీ చేసిన అధికారులు.. 48 గంటల్లో లైసెన్స్ కు అవసరమైన అనని పత్రాల్ని సమర్పించాలని లేనిపక్షంలో మల్టీఫ్లెక్స్ ను మూసేస్తామని పేర్కొన్నారు. అంత పెద్ద మల్టీఫ్లెక్స్ స్టార్ట్ చేసిన పీవీఆర్.. వ్యాపారం చేయటానికి అవసరమైన కనీస లైసెన్స్ తీసుకోలేదన్నది ఇప్పుడు షాకింగ్ గా మారింది.