Begin typing your search above and press return to search.
తమ్ముళ్లకు 95.. మిత్రుడికి 55 ఇస్తారట
By: Tupaki Desk | 5 Jan 2016 5:01 AM GMTత్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో వేడి షురూ అయ్యింది. రేపో.. మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే తెలుగుదేశం.. బీజేపీల మధ్య సీట్లసర్దుబాటు వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చగా మారింది.
2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీ 45 డివిజన్లలో గెలిచింది. ఈ నేపథ్యంలో మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై రెండు పార్టీల మధ్య చర్చలు షురూ అయ్యాయి. 2009 ఎన్నికల్లో ఎవరికి వారుగా టీడీపీ.. బీజేపీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి అందుకు భిన్నంగా రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగనున్నాయి. 2009తో పోలిస్తే.. ఇప్పుడు బీజేపీ బలపడిందని.. ప్రధాని మోడీ నేతృత్వంలో పార్టీ శక్తివంతమైన నేపథ్యంలో తాము ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ బావిస్తోంది.
ఇక.. తెలుగుదేశం పార్టీ ఆలోచన మరోలా ఉంది. గ్రేటర్ పరిధిలో తమకు బలం ఉన్నందున.. తామే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. తాజా లెక్కల ప్రకారం తాము95 స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది.మిగిలిన 55 స్థానాల్ని మిత్రుడికి కేటాయించాలని అనుకుంటోంది. ఇక.. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్నది ఇరుపార్టీ నేతలు డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికలకు సమాయుత్తం కావటానికి వీలుగా చంద్రబాబు హైదరాబాద్ లో భారీ ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. సమావేశాల సంగతి ఓకే.. సీట్ల విషయంలో మిత్రుల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండా ముగుస్తుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు.