Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఓట్ల లెక్కింపు ఆలస్యనికి కారణం అదా...

By:  Tupaki Desk   |   4 Feb 2016 9:30 AM GMT
గ్రేటర్ ఓట్ల లెక్కింపు ఆలస్యనికి కారణం అదా...
X
సాధారణంగా ఓట్ల లెక్కింపు అంటే ఉదయమే ప్రారంభమవుతాయి. కానీ, గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహచ్ ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. గ్రేటర్ లెక్కింపు కూడా ఉదయమే ప్రారంభం కావల్సి ఉంది. షెడ్యూల్ లో భాగంగా ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టంగా ప్రకటించింది కూడా. కానీ... తాజా పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య జరిగిన ఘర్షణలు ఫలితంగా పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ అవసరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రీపోలింగే ఓట్ల లెక్కింపు టైమును మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు తో పురానాపూల్ లో శుక్రవారం 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయబోతున్నారు. దీంతో అది పూర్తికాకుండా ఓట్ల లెక్కింపు మొదలు పెట్టే అవకాశం లేదు. దీంతో పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి. అందుకు పోలింగును కూడా సాయంత్రం 4 గంటలతో ముగిసేలా ఏర్పాటు చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా లెక్కింపునూ సాయంత్రం 4 నుంచే ప్రారంభించబోతున్నారు.
దీంతో శుక్రవారం మధ్యాహ్నానానికి తెలియాల్సిన గ్రేటర్ ఫలితాల కోసం రాత్రి వరకు ఆగక తప్పని పరిస్థితి. ఇలా ఓట్ల లెక్కింపు సాయంత్రం మొదలైన పరిస్థితి ముందెన్నడూ గ్రేటర్ లో లేదు.