Begin typing your search above and press return to search.
సర్కారుకు వణుకు పుట్టిస్తున్న కార్మికులు
By: Tupaki Desk | 11 July 2015 11:04 PM GMTఆందోళనలు.. నిరసనలు.. సమ్మెలు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు కొత్తేంకాదు. పేరుకు పదమూడు నెలల పాలన అయినప్పటికీ.. ఇలాంటి విషయాల్లో చాలానే అనుభవం సంపాదించింది. అయితే.. వీటికి భిన్నంగా తాజా ఆందోళన ఒకటి షురూ అయ్యింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చింది. దాదాపు ఆరు రోజులుగా సాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మెతో.. భాగ్యనగరి కాస్తా ఇప్పుడు చెత్త నగరిగా మారింది. ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తూ.. నగరం కంపు కొట్టే పరిస్థితి. కార్మికులు చేస్తున్న డిమాండ్ల విషయంలో సర్కారు సానుకూలంగా ఉందని చెబుతూనే.. రాతపూర్వకంగా రాసి ఇచ్చేందుకు సై అంటున్నారు.
అయితే.. రాతపూర్వకంగా హామీల్ని పరిష్కరిస్తామని చెబుతున్న సర్కారు.. వాటిని ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని మాత్రం తర్వాత చెబుతామని చెబుతున్నారు. దీంతో.. ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల్ని కార్మిక సంఘాల నేతలు బహిష్కరించారు. అదే సమయంలో.. ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. తమ సమ్మె ఉధృతం చేస్తానమని.. వీధిదీపాలు.. మంచినీళ్లూ బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తమ సమస్యల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని.. తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌నివాసంతో పాటు.. మంత్రులు.. ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని.. సీఎం ఇంటి ముందు చెత్త కుమ్మరిస్తామని వార్నింగ్ ఇస్తోంది. సోమవారం నుంచి సమ్మె తీవ్రత ఏమిటోప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తామని వారు చెబుతున్నారు.
పారిశుధ్య కార్మికుల సమ్మె మరో అంకంలోకి మారటం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నో సమ్మెల్ని చూసినప్పటికీ.. పారిశుధ్య కార్మికుల సమ్మె మాత్రం ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నట్లుగా చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా కాకుండా.. యుద్ధప్రాతిపదికన సమస్యకు పరిష్కారం కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు.
వారి సమస్యలపట్ల ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీనియర్ అధికారుల్ని రంగంలోకి దింపటమే కాదు.. ఆదివారం సాయంత్రానికి పరిష్కారం వెతకాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లలో కొన్నింటిని వెంటనే అమలు చేసేలా ఒప్పించాలని కోరుతోంది. మొత్తంగా ఆదివారం సాయంత్రానికి సమ్మె విరమణ దిశగా అడుగులు పడటం ఖాయంగా చెబుతున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె విషయంలో.. సర్కారు అనుకున్నట్లు.. జరుగుతుందో లేదో చూడాలి.