Begin typing your search above and press return to search.

కృష్ణానదిలో రాక్షస చేపలు..కొత్త భయాలు!

By:  Tupaki Desk   |   23 July 2016 6:19 AM GMT
కృష్ణానదిలో రాక్షస చేపలు..కొత్త భయాలు!
X
మరికొద్ది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభంకాబోతున్నాయి.. ప్రభుత్వాలు వాటికి సంబందించిన పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాయి. ఎవరు ఏరోజు కుటుంబ సభ్యులతో కలిపి పుష్కర స్నానాలకు బయలుదేరాలని ప్రజలు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ తరుణంలో తాజాగా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్థానిక మత్స్యకారులే బెంబేలెత్తుతున్నారు!

త్వరలో పుష్కరాలు జరగబోయే కృష్ణానదిలో కొన్ని చేపల కలేబరాలు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. వీటికి కారణం కృష్ణానదిలో తాజాగా కనిపిస్తున్న రాక్షస చేపలేనట! ఇవి ఈ నదిలో లక్షల సంఖ్యలో ఉండి ఉండొచ్చని, వీటి ఒంటినిండా ముళ్లు, సూదుల్లాంటి పళ్లు ఉంటాయని.. ఎంత పెద్ద చేపనైనా ఇవి సునాయాసంగా చీల్చి పారేస్తాయని, ఇక వలల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, ఈ చేపలను పట్టుకోవాలని చూస్తే... రక్తం కళ్లచూస్తాయని జార్లలు చెబుతున్నారు.

ఇవి కృష్ణానదిలో ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాడానికన్నట్లు... మూడు రోజుల వ్యవధిలో సుమారు మూడు టన్నుల రాక్ష చేపలు వలల్లో పడ్డాయట. అయితే ఇవి తినడానికి ఉపయోగపడకపోవడంతో వాటన్నింటినీ అలానే పక్కన పాడేస్తున్నారట. ఈ రాక్షస చేపలపై మత్య్సశాఖాధికారులు వీలైనంత త్వరగా స్పందిస్తే.. భక్తులు దైర్యంగా స్నానాలాచరించగలరు, జాలర్లు వారి పని వారు చేసుకోగలరు!!