Begin typing your search above and press return to search.

కాశ్మీరులో హిందుస్థాన్ నినాదం...ఆజాద్ అజెండా అదే...?

By:  Tupaki Desk   |   11 Sep 2022 2:56 PM GMT
కాశ్మీరులో హిందుస్థాన్ నినాదం...ఆజాద్ అజెండా అదే...?
X
జమ్మూ కాశ్మీర్ లో తొందరలో శాసనసభ‌ ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికలలో అక్కడ ఉన్న అన్ని పార్టీలు కలసి పోటీ చేస్తాయి. ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లా, మొహబూబ్ ముఫ్తీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. మరో వైపు బీజేపీ ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ కూటమీ ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీకి మెజారిటీ ఉన్నా కూడా అందరూ కలిశారు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి.

ఇక ఇపుడు చూస్తే సీనియర్ మోస్ట్ నేత గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన సొంతంగా పార్టీని పెట్టబోతున్నారు. నిజానికి బీజేపీ కూడా అదే కోరుకుంటోంది. ఆయన తన పార్టీని పదిరోజుల్లో ప్రకటిస్తాను అని చెబుతున్నారు. ఆ పార్టీలో హిందూస్థాన్ శబ్దం ద్వనిస్తుంది అని ఆయన చెబుతున్నారు. అంటే ఒక విధంగా బీజేపీ బాణీలోనే అనుకోవాలి.

అదే టైం లో ఆజాద్ లోకల్ ఉన్న ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ పార్టీలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆర్టికల్ 370 అన్నది మళ్ళీ పునరుద్ధరించడం కష్టమని చెబుతున్నారు. 370ని మళ్లీ తీసుకురావాలీ అంటే పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలని అన్నారు. అది ఇపుడున్న పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యపడదు అని ఆయన చెప్పుకొచ్చారు. లోకల్ గా ఉన్న పార్టీలు ఈ విషయంలో మభ్యపెడుతున్నాయని తాను వాస్తవాలు చెబుతున్నాను అంటూ ఆయన జనాల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక విధంగా 370 రద్దు అన్నది బీజేపీ అభీష్టం. మళ్లీ తీసుకురాకపోవడం ఆ పార్టీ ఆలోచన కూడా. అదే మాటను ఇపుడు ఆజాద్ అంటున్నారు అంటే ఆయన అజెండా కూడా క్లియర్ అని అర్ధమవుతోంది. ఇక మూడు బలమైన పార్టీలు కలసి ఉన్న విపక్ష కూటనికి ఆజాద్ వచ్చి బద్ధలు కొట్టి బీజేపీకి చేయాల్సిన రాజకీయ మేలు ఇప్పటికే చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఇపుడు అసలైన కాంగ్రెస్ నాయకులు అంతా ఆజాద్ బాట పట్టారు. అక్కడ కాంగ్రెస్ నామమాత్రమైంది.

దీంతో పాటు ఆయన లౌకికవాదాన్ని చాటుతున్నారు. తన పార్టీకి హిందూస్థానీ పేరును కలుపుతాను అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆజాద్ తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేస్తారు. ఇక ఫారూఖ్ ముఫ్తీ పార్టీల కూటమి మరో వైపు ఉంటుంది. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. అంటే త్రిముఖ పోటీ సాగుతుంది అన్న మాట. ఈ పోరులో కచ్చితంగా విపక్షం ఓట్లు చీలిపోతాయి. అటు ఆజాద్ పార్టీ ఇటు బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆజాద్ కాశ్మీర్ కి కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.

అలా జరగాలనే బీజేపీమాస్టర్ ప్లాన్ వేసింది. ఇపుడు ఆజాద్ చేస్తున్న ప్రయత్నాలు ఆయన ఆలోచనలు ఎత్తుగడలు అన్నీ చూస్తే కనుక బీజేపీలో ఉన్న తన దోస్త్ మోడీ ఆలోచనల మేరకే ఆజాద్ కొత్త పార్టీని రూపకల్పన చేసి ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అన్న చర్చ వస్తోంది. ఆజాద్ కాశ్మీర్ కి చెందిన నాయకుడే అయినప్పటికీ ఆయన కేంద్రంలో మంత్రిగానే ఎపుడూ పనిచేశారు తన సుదీర్ఘ రాజకీయం అంతా జాతీయంగానే పూర్తి చేసుకున్న ఆయన 2007 ప్రాంతంలో కొన్నాళ్ళ పాటు సీఎం గా కాశ్మీర్ లో కుర్చీ అలంకరించారు. మొత్తానికి నాడు కాంగ్రెస్ సీఎం గా కనిపించిన ఆజాద్ రేపటి రోజున బీజేపీ మద్దతుతో సీఎం సీటును అందుకుంటారా అంటే జరిగేది ఇదే అని అంటున్నారు.