Begin typing your search above and press return to search.
ఆజాద్ కు కశ్మీర్లో నో ఎంట్రీ!
By: Tupaki Desk | 8 Aug 2019 1:30 PM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కు కశ్మీర్ లోకి ఎంట్రీ లభించలేదు. ఆయనను శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచినే భద్రతా దళాలు తిప్పి పంపాయి. కశ్మీర్ కు కేంద్ర ప్రభుత్వం స్వయంప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత తొలి సారి ఆ రాష్ట్రంలో పర్యటించడానికి అంటూ ఆజాద్ బయల్దేరారు. తను జమ్మూ కాశ్మీర్ ప్రజలను, అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలను కలుసుకోవాలని అంటూ ఆయన వెళ్లారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ రాజకీయ పార్టీ నేతలను బయటకు వదలడం లేదు. జమ్మూ కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీల నేతలను కూడా దాదాపు గా హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ విషయాన్ని వారు చెప్పుకుని వాపోతూ ఉన్నారు. కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు వ్యతిరేక వాణినే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గులాం నబీ ఆజాద్ కశ్మీర్లో పర్యటించే ప్రయత్నం చేశారు. కానీ కేంద్రం అందుకు అనుమతిని ఇచ్చేలా లేదు.
శాంతిభద్రతల కారణాన్ని చూపి.. ఆయనను శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెనక్కు తరలించారు. అయితే తనను అక్రమంగా వెనక్కు పంపారంటూ ఆజాద్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నిషేధాజ్ఞల నేపథ్యంలోనే ఆయనను వెనక్కు పంపినట్టుగా అధికారులు ప్రకటించారు.